Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఎండాకాలం మీ వంటల్లో ఈ మసాలాలు అస్సలు వేసుకోకూడదట.. ఆ రోగాలకు కారణం ఇవే
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా వేడిగా వాతావరణం మారిపోతుంది. గాలిలో తేమ శాతం కూడా భారిగా తగ్గిపోతుంది. దీంతో శరీరంలో వేడి కూడా పెరిగిపోతుంది. దీనికి తోడు వేసవి కాలంలో మనం తినే ఆహరం కూడా మన శరీర ఉష్ణోగ్రతను పెంపొందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వేసవి కాలంలో చాలా మంది తమ తమ ఆహార పదార్థాల్లో మసాలాలను ఎక్కువగా వాడుతుంటారు. ఇవి రుచి కోసం వాడినవే అయినా మన శరీరంలో అనేకమైన మార్పులను తీసుకొస్తాయి. మరీ ముఖ్యంగా శరీరంలో వేడి పెరిగేందుకు ఇవి కారణం అవుతాయి. దీనివల్ల తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని రకాల మసాలాలు దూరం ఉంచితే సరిపోతుందట. వాటి వల్ల వేడి తగ్గడంతో పాటు.. మన శరీరం శక్తివంతంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ మసాలాలు ఏంటి? వాటిని ఏ విధంగా వినియోగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేసవిలో మసాలాలు - ఏవి దూరంగా ఉంచాలి?
లవంగం: సాధారణంగా ఇమ్యూనిటీని మెరుగుపరచే ఈ మసాలా వేసవిలో అధికంగా తీసుకుంటే తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కలిగిస్తుంది. దీనివల్ల నీరసం వంటి సమస్యలు కూడా కలుగుతాయి. అసలే అలసటగా ఉండడంతో పాటు నీరసం తోడైతే ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే ఛాన్సుంది.

నల్ల మిరియాలు: శరీర ఉష్ణోగ్రతను పెంచే లక్షణం కలిగిన ఈ మసాలా వేసవిలో చర్మ సమస్యలకు దారితీస్తుంది.
దాల్చిన చెక్క: యాంటీ ఆక్సిడెంట్లతో సంపన్నమైనా, వేసవిలో ఇది శరీర వేడి పెంపునకు కారణమవుతుంది, వాంతులు, అసిడిటీ వంటి సమస్యలు కలగవచ్చు.
జాజికాయ: స్వద్ది కోసం వాడినా వేసవిలో అధికంగా తీసుకుంటే తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇంగువ: జీర్ణక్రియకు సహాయపడుతుంది కానీ వేసవిలో అధికంగా వాడితే విరేచనాలు, గ్యాస్ సమస్యలు కలగవచ్చు.
వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ప్రత్యామ్నాయాలు:
వేడి పెంచే మసాలాల బదులు శరీరానికి చల్లదనం ఇచ్చే పదార్థాలను వాడటం మంచిది:
సోంపు: శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది.
పుదీనా: సహజంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
కొత్తిమీర పొడి మరియు పచ్చి ఏలకులు: తేలికపాటి, సువాసన కలిగినవి కావడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పెరుగు, నిమ్మకాయ, దోసకాయ: ఇవన్నీ శరీరానికి తేమను అందించడమే కాకుండా, జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి.
చివరిగా
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే రుచికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మసాలా పదార్థాల వినియోగాన్ని పరిమితం చేసి, శరీరాన్ని తేలికగా, చల్లగా ఉంచే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇదే సమయంలో నీటి సేవనాన్ని పెంచడం, సహజ పానీయాలను తీసుకోవడం ద్వారా వేడి సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications