Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారా? ఆఫీసు పని పక్కనపెట్టి ఒక నిమిషం ఇది చేయకపోతే మీ లివర్ అస్సామే!
ప్రస్తుతం అందరి జీవితాలు బిజీగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో మనలో చాలామందికి కుర్చీనే ప్రపంచంగా మారింది. ఆఫీసులో గంటల తరబడి కంప్యూటర్ ముందు, ఇంట్లో టీవీ లేదా మొబైల్ ఫోన్ కు అతుక్కుపోయి మన సమయాన్ని గడిపేస్తున్నాం. కూర్చోవడం చాలా సాధారణ విషయమే అయినా ఈ అలవాటు మన ఆరోగ్యానికి ముఖ్యంగా మన శరీరంలోని కీలక అవయవమైన కాలేయానికి ఒక సైలెంట్ కిల్లర్ గా మారుతోంది.
అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?
కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇది కాలేయంలో వాపును కలిగించి దాని పనితీరును నెమ్మదింపజేస్తుంది. దీనిని ప్రారంభంలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే, భవిష్యత్తులో సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి.. మందు తాగడం వల్ల వచ్చేది,రెండోది..మద్యపానంతో సంబంధం లేని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD). ఇది ఎక్కువగా మన లైఫ్ స్టైయిల్ లోపాల వల్లే వస్తుంది.

కూర్చోవడానికి, కాలేయానికి సంబంధం ఏమిటి?
గంటల తరబడి కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని కండరాలు స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. దీంతో శరీరంలో ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటుంది. బ్లడ్ లోని షుగర్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. ఆ కొవ్వుకు మొదటి చిరునామా మన కాలేయమే. ఇలా కాలేయంలో కొవ్వు చేరడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య స్టార్ట్ అవుతుంది.
ఈ ముప్పు ఎవరికి ఎక్కువ?
ఆఫీసుల్లో లేదా ఫ్యాక్టరీల్లో డెస్క్ ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు, గంటల తరబడి స్క్రీన్ ముందు గడిపేవారు ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే..స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరగడంతో పిల్లలు, యువతలో కూడా ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. కేవలం ఊబకాయం ఉన్నవారికే ఈ సమస్య వస్తుందనుకోవడం పొరపాటు. సన్నగా, సాధారణ బరువు ఉన్నప్పటికీ గంటల తరబడి కూర్చునే వారికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది.
నివారణ మన చేతుల్లోనే ఉంది
మన జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ ను నివారించవచ్చు లేదా నియంత్రించవచ్చు.
-ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి లేచి కాస్త అటూ ఇటూ నడవండి. చిన్నపాటి సాగదీత వ్యాయామాలు చేయండి.
-ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయండి.
-మీ భోజనంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications