Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మీరు ఎంతకాలం బతుకుతారో ఇలా తెలుసుకోవచ్చు
మన వేళ్ల గోళ్లలోనే మొత్తం మన జీవిత రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? మీ వేలి గోళ్లు ఎంత వేగంగా పెరుగుతాయో దాని ఆధారంగా మీ జీవితకాలం అంచనా వేయవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జన్యుశాస్త్రంలో నిపుణుడు డాక్టర్ డేవిడ్ సింక్లైర్ తెలిపారు. మన శరీరం కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేసే రేటుకు గోళ్ల ఆరోగ్యం కీలక సూచిక అని తెలిపారు. ఇది ఎంత త్వరగా జరిగితే, వయస్సు సంబంధిత క్షీణత నుండి మనం రక్షించబడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఓ పాడ్ కాస్ట్ లో డేవిడ్ మాట్లాడుతూ..మీ గోళ్ల పెరుగుదల రేటు మీరు వృద్ధాప్యం అవుతున్నారా లేదా అనేదానికి సంకేతమని తెలిపారు.
1979లో జరిగిన ఒక అధ్యయనాన్ని డేవిడ్ ప్రస్తావించారు. ఆ అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు వందలాది మంది గోళ్లకు చిన్న కొలత టేపులను అతికించి కొన్ని సంవత్సరాల పాటు వాటి పెరుగుదలను ట్రాక్ చేశారు. 30 సంవత్సరాల ఏజ్ నుండి వారపు వేలుగోళ్ల పెరుగుదల రేటు సంవత్సరానికి 0.5 శాతం తగ్గిందని సైంటిస్టులు కనుగొన్నారు. గోళ్లు దీని కంటే వేగంగా పెరుగుతుంటే, మీ వయస్సులో ఉన్న ఇతర వ్యక్తుల కంటే మీరు వాటిని తరచుగా కత్తిరించాల్సి వస్తే మీరు సగటు కంటే నెమ్మదిగా వృద్ధాప్యం చెందుతున్నారనడానికి ఇది సంకేతం కావచ్చు అని అధ్యయన పరిశోధకులు సూచించారు.

తన గోర్లు వాటి పెరుగుదలలో మందగమనం చెందుతున్నాయా లేదా అనే దానిపై తాను శ్రద్ధ వహిస్తానని, తన గోళ్లను కత్తిరించుకోవాల్సిన ప్రతిసారీ తాను ఎంత తరచుగా తన గోళ్లను కత్తిరించుకున్నానని అని ఆలోచిస్తూ ఉంటానని డేవిడ్ తెలిపారు.
మన వయసు పెరిగే కొద్దీ రక్త ప్రసరణ మందగించడం వల్ల వయస్సు గోళ్ల పెరుగుదలను ప్రభావితం చేస్తుందని,అంటే గోళ్లకు పెరుగుదలకు ఆజ్యం పోసే పోషకాలు తక్కువగా లభిస్తాయని తెలిపారు. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయన్నారు. తీసుకునే ఆహారం, గోళ్ల లోపాలు ఉన్నవారిలో గోళ్ల పెరుగుదల నెమ్మదిగా ఉండటం వంటివి ఉంటాయి.
వేలి గోళ్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కీలకమైన సంకేతంగా కూడా ఉండవచ్చన్నారు. వృద్ధులలో గోళ్లపై గట్లు ఏర్పడటం సర్వసాధారణం, ఎందుకంటే అవి వృద్ధాప్యానికి సాధారణ సంకేతం, కొత్త కణాల ఉత్పత్తి మందగించడం వల్ల ఇవి సంభవిస్తాయి. అయితే యువతలో అవి అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కూడా ఉండవచ్చు. గవదబిళ్ళలు, మధుమేహం, హైపర్‌పారాథైరాయిడిజం వంటి ఆరోగ్య సమస్యలకు ఇది సంకేతం అవొచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.
గోర్లు వ్యక్తి వ్యక్తికి కొంత వైవిధ్యాన్ని చూపిస్తాయని వాటి ఆకారం. రంగులో సంభవించే ఏవైనా మార్పులను గమనిస్తే దానిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు తెలిపారు. గోరు కింద నల్లటి మచ్చలు మెలనోమా లేదా గోరు కింద పెరుగుతున్న మొటిమ వంటి క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. మీ గోళ్ళపై తెల్లని మచ్చలు, గీతలు ఉంటే.. మీ ఆహారంలో తగినంత జింక్, కాల్షియం లేదా ఇనుము పొందకపోవడానికి లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. శరీర కణజాలాలలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం, సాధారణంగా దీర్ఘకాలిక గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కలిగే హైపోక్సియా వల్ల గోళ్ల ఆకారంలో మార్పు సంభవించవచ్చని నిపుణులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications