Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వంట గదిలోని ఈ చిన్న పదార్థం తగిలితే.. మీ జుట్టు మొత్తం రాలిపోతుంది! ఏం చేయాలంటే
మనిషి అందానికి ప్రతీక జుట్టు. ఈ జుట్టు ఎంత మృదువుగా, అందంగా ఉంటుందో అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మహిళలు తమ జుట్టును చాలా పదిలంగా రక్షించుకుంటారు. చిన్న చిన్న కేర్ తీసుకుంటూ జుట్టును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తమ తమ కురులు అందంగా బలంగా ఉండేందుకు చక్కటి కండిషనర్లు, ఆయిల్స్, హెర్బల్ షాంపూలు ఇలా ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అయితే మన నిజ జీవితంలో మనం వినియోగించే కొన్ని పదార్థాలు జుట్టు రాలడానికి తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయని చెబుతుంటారు. అవి జుట్టును బలహీనంగా చేయడంతో పాటు, జుట్టును బలహీనం చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహారపదార్థాలు ఏంటి? వాటి వల్ల జుట్టుకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉప్పు.. తక్కువగా వాడినా, ప్రభావం ఎక్కువగా?
కిచెన్‌లో మనం తరచుగా ఉపయోగించే పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి. ఈ ఉప్పు వంటకాల రుచిని పెంచే అవసరమైన పదార్థం. కానీ వంట సమయంలో చేతులకు అంటిన ఉప్పును శుభ్రం చేయకుండా జుట్టును తాకితే, అది జుట్టు మూలాలను బలహీనపరిచి రాలిపోవడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పులోని సోడియం మరియు ఇతర మినరల్స్ తలపై ఎక్కువసేపు ఉండిపోతే, తడి లేదా చెమటతో కలిసి స్కాల్ప్‌ను డ్రై చేస్తుంది. స్కాల్ప్‌లో నూనె సంతులనం పోతుంది, దాంతో వెంట్రుకలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే జుట్టు కుదురులు బలహీనమవుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌కు కూడా దారి తీస్తుంది. తద్వారా జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది.

బీచ్ వాటర్ ప్రభావం కూడా అంతే!
బీచ్ సముద్రపు నీటిలో ఉప్పు అధికంగా ఉండటం వల్ల బీచ్‌లకు వెళ్లిన వెంటనే లేదా అక్కడ నీటిలో స్నానం చేసిన తర్వాత జుట్టు డ్రై అయిపోవడం, బలహీనపడటం కనిపించవచ్చు. సముద్ర నీటిలోని సోడియం క్లోరైడ్ (ఉప్పు) తల నూనెను పూర్తిగా తొలగించి, జుట్టు పొడిబారిపోయేలా చేస్తుంది. బీచ్ నుంచి వచ్చిన వెంటనే జుట్టును తేమపరిచే షాంపూ మరియు కండీషనర్ వాడటం ఉత్తమం.
జుట్టు ఆరోగ్యానికి సహజ మార్గాలు
ఉప్పు ప్రభావంతో పాటు, జీవితశైలి మార్పులు, ఒత్తిడి, అహార అలవాట్లు కూడా జుట్టు రాలే ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్యకు సులభమైన, సహజమైన పరిష్కారాలు ఉన్నాయి..
నల్ల జీలకర్ర తైలం:
ఇది జుట్టు ములతాళాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది.
ఆముదం నూనె:
తలపై మసాజ్ చేసి 30 నిమిషాలు ఉంచి షాంపూ చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.
ఉసిరికాయ పాకం:
వీటిలో ఉన్న విటమిన్ C జుట్టు శక్తిని పెంచుతుంది. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతుంది. దీనివల్ల కుదుర్లు బలంగా తయారవడంతో పాటు జుట్టు ఆరోగ్యం బాగుపడుతుంది.
ఆహారంలో మార్పులు:
జుట్టును బయటి నుంచి ఎంత రక్షించినా లోపల కూడా అంతే పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, ఐరన్, బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు చిక్కుడు కాయలు, పన్నీర్, పాలకూర, గుడ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ చేతులకు ఉప్పు అంటిన తర్వాత జుట్టును తాకే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. చిన్న అలవాటు అయినా పెద్ద సమస్యను నివారించగలదు. అలాగే కెమికల్స్‌తో నిండిన హెయిర్ ప్రొడక్ట్స్‌కు బదులుగా సహజ మార్గాలు, ఇంట్లో తయారుచేసుకునే ఆయిల్స్, మాస్క్స్ వాడటం వల్ల దైర్యంగా, బలంగా పెరిగే జుట్టును పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications