Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
క్యాన్సర్ పై బ్రహ్మాస్త్రం..14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్!
భారతదేశ ప్రజారోగ్య రంగంలో ఒక చారిత్రాత్మకమైన, నిశ్శబ్ద విప్లవం మొదలవుతోంది. ఒకప్పుడు కేవలం చిన్నపిల్లల ప్రాథమిక వ్యాధులకే పరిమితమైన టీకా కార్యక్రమాలు, ఇప్పుడు ఏకంగా క్యాన్సర్ ను రాకముందే అడ్డుకునే స్థాయికి విస్తరిస్తున్నాయి. ఏటా దేశంలో సుమారు 80 వేల మంది మహిళల ప్రాణాలను బలిగొంటున్న మహమ్మారి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(Cervical Cancer).
ఈ మహమ్మారికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)వ్యాక్సిన్ అందించేందుకు సన్నద్ధమైంది.

ప్రచార కార్యక్రమం ఎలా సాగుతుంది?
ఫిబ్రవరి 28, 2026న రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల బాలికలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా హాస్పిటల్స్ లో అమెరికన్ సంస్థ తయారు చేసిన గార్డసిల్-4 (Gardasil-4) వ్యాక్సిన్ ను ఒక్క డోసుగా ఉచితంగా ఇస్తారు.
ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రుల లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. తొలి 90 రోజుల పాటు ఈ ప్రచారం ఒక మహా ఉద్యమంలా సాగుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన వారి కోసం సాధారణ రోగనిరోధక షెడ్యూల్ లో లభ్యమవుతుంది.
వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గకుండా ఉండేందుకు ప్రతి కేంద్రంలో కోల్డ్ చైన్ పాయింట్ (CCP)ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు (AEFI) తలెత్తితే తక్షణమే ట్రట్మెంట్ అందించడానికి ప్రత్యేక వైద్యాధికారులను సైతం నియమించారు. సామాన్యులకు కూడా సులభంగా చేరువయ్యేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు.
టీకా క్యాన్సర్ ను ఎలా అడ్డుకుంటుంది?
అసలు గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం HPV అనే వైరస్. ఇందులో ముఖ్యంగా HPV 16, 18 రకాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి శరీరంలోకి ప్రవేశించి, చర్మ కణాల నిర్మాణాన్ని హైజాక్ చేస్తాయి. శరీరంలోని క్యాన్సర్ నిరోధక ప్రొటీన్లను నిర్వీర్యం చేసి, కణాలు అనియంత్రితంగా పెరిగేలా చేస్తాయి.
ఈ వ్యాక్సిన్ లో నిజమైన వైరస్ ఉండదు. బదులుగా పైకి వైరస్ లా కనిపించే వైరస్ లైక్ పార్టికల్స్(VLPs) అనే డూప్లికేట్ ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై యాంటీబాడీలను (శరీర రక్షక భటులను) భారీగా ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో నిజమైన వైరస్ దాడి చేస్తే ఈ యాంటీబాడీలు వెంటనే దాన్ని గుర్తించి నాశనం చేస్తాయి. ఇలా జీవితకాలం పాటు క్యాన్సర్ ముప్పును 90 శాతం వరకు ఈ టీకా తగ్గిస్తుంది.

సరిగ్గా 14 ఏళ్లకే ఎందుకు?
టీనేజ్ వయసులో పిల్లల రోగనిరోధక వ్యవస్థ అత్యంత శక్తివంతంగా, యాక్టివ్ గా ఉంటుంది. భవిష్యత్తులో ఈ వైరస్ బారిన పడే అవకాశం రాకముందే వారికి ఈ రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. ఈ వయసులో ఇచ్చే ఒక్క డోసు కూడా జీవితకాలం సరిపడా రోగనిరోధక శక్తిని ఇస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది.
అబ్బాయిలకూ ఈ వైరస్ ముప్పు ఉన్నప్పటికీ ముందుగా బాలికలను రక్షించడం ద్వారా సమాజంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకుని హెర్డ్ ఇమ్యూనిటీ(సామూహిక రోగనిరోధకత) సాధించవచ్చు. దశాబ్దాల పరిశోధనల తర్వాత అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ టీకా వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా స్వల్పం. వ్యాధి వచ్చాక లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయడం కంటే, అది రాకుండా ముందే తుంచేసే ఈ అద్భుత ప్రయోగం రాబోయే తరాల మహిళలకు ఒక వరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications