Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మంచి మొక్కలు!

దిగువ పేర్కొన్న 5 మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా లక్కీ మొక్కలుగా పరిగణించబడుతున్నాయి. అవేమిటో, వాటికి కారణమేమిటో పరిశీలిద్దాం!
1. లక్కీ బాంబూ ప్లాంట్స్ - ఇవి చైనాలో పుట్టినవైనప్పటికి ఇండియాలో ఫెంగ్ షూ ఇ లో భాగంగా అతిగా పెంచుతున్నారు. లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి. ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు.
2. ఫోర్ లీఫ్ క్లోవర్ - ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక అరుదైన మొక్క. నాలుగే ఆకులుంటాయి. ఈ మొక్క కనపడితే చాలు మంచి జరుగుతుందనే నమ్మకం 17వ శతాబ్దంనుండి వుంది.
3. తులసి మొక్క - తులసి మొక్క ప్రాధాన్యత హిందువులకందరకూ తెలిసినదే. దీనిని లక్ష్మీ దేవిగా భావించి హిందువులు పూజలు చేస్తారు. ఆకులు ఆహారాన్ని, దుస్తులను మొదలైనవాటిని శుభ్రం చేయటానకి ఉపయోగిస్తారు. నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు భావిస్తారు.
4. స్నేక్ ప్లాంట్ - ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
5. మనీ ప్లాంట్ - అదృష్టాన్నిచ్చే మొక్కలలో ఇది పురాతన మొక్క. శీటిని ఒక బాటిల్ లోని నీటితో కూడా పెంచుతారు. ఇవి ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే వుంటాయి. వేగంగా పెరుగుతాయి. వీటిని కొంతమంది పైనుండి కిందకు పాకేలా చేస్తారు. కాని ఇది సరికాదు. మొక్క కిందనుండి పైకి పాకుతూ వుంటేనే ఐశ్వర్యం వస్తుంది.



Click it and Unblock the Notifications