Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
రొమాన్స్ అధికం చేసే రూమ్ డెకరేషన్!

రూమ్ లైటింగ్: రూమ్ లో లైటింగ్ మీకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా వుండాలి. అలాగని దానిపై అధిక వ్యయం కూడా చేయరాదు. రూమ్ అవసరాన్నిబట్టి ఒక కేండిల్ వెలిగించినా బాగానే వుంటుంది. కంటికి ఒత్తిడినిచ్చే లైటు ఫిటింగ్ లు బెడ్ రూమ్ లోఅవసరం లేదు. పగలయితే మందపాటి కర్టెన్లు వేసి అధిక లైటింగ్ తగ్గించి రూమ్ ను సౌకర్యవంతంగా కూడా చేసుకోవాలి.
బెడ్డింగ్: బెడ్ రూమ్ లో మరో ప్రధానంగా వుండాల్సిన సౌకర్యం చక్కని పడకలు. మెత్తగా వుండి కంటికి ఇంపుగా కనపడే శాటిన్ బెడ్ కవర్లు వేసిన మేట్రెస్ లు, వేయండి. బెడ్ షీట్లు రూమ్ అలంకరణకు తగినట్లు వివిధ రంగులలో ...ఎరుపు, రోజ్ కలర్, పింక్ రంగులలో బాగుంటాయి. కర్టెన్లు కూడా వివిధ రకాలుగా అలంకరించవచ్చు. కర్టెన్ల పక్క భాగంలో వేలాడే డ్రేప్స్ మంచి రిచ్ లుక్ ఇస్తాయి. మరింత బాగా కనపడాలంటేకర్టెన్లకు మందపాటి కలర్లు ఎంపిక చేయండి. బెడ్ పై హార్ట్ షేప్ లో వుండే కుషన్లు లేదా నలుచదరం, గుండ్రం కుషన్లు వేస్తే ఇంకా బాగుంటుంది.
పడక గదిలో సువాసనలనిచ్చే కేండిల్స్, లేదా అగర బత్తీలు మిమ్మల్ని మరింత ఆహ్లాద పరుస్తాయి. లవెండర్, వనిలా, రోజ్, ఛామోమైల్ వాసనలతో కొన్ని రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఉపయోగించి రూమ్ అలంకరణ మరింత బాగా చేయవచ్చు.



Click it and Unblock the Notifications