Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేన్ ఫర్నిచర్ సొగసులు చూడతరమా?

మీరు గనుక ఇంటిలో కేన్ ఫర్నచర్ అలంకరించాలనుకుంటే దానిని గూర్చి పూర్తిగా తెలుసుకోండి.
మొదటగా. కేన్ ఫర్నిచర్ అనేది గార్డెన్ లోనే వుండాలి...అనే భావనను తొలగించుకోండి. బహుశ, మీరు బీచ్ రిసార్టులకు వెళ్ళే వుంటారు. ఆ రిసార్టులో అన్నీ కేన్ ఫర్నిచరే వుంటాయి. అక్కడ అవి బాగుంటే, మీ లివింగ్ రూమ్ లో ఎందుకు బాగుండవు? ఆలోచించండి. మీరు కొద్దిపాటి ఫర్నిచర్ తో కొత్తగా కాపరం పెట్టుకుంటుంటే, చక్కగా గుండ్రటి ఈ వెదురు ఫర్నిచర్ వాడండి. జాగా కలిసి వస్తుంది. వీటి డిజైన్లు చాలా సన్నంగా వుంటాయి. సాధారణంగా ఏడు లేదా ఎనిమిది వేల రూపాయలలో పూర్తి సెట్ వచ్చేస్తుంది. అయితే, వీటిలో వేసే కుషన్లు మెత్తనైనవిగా చూడండి. వచ్చిన అతిధులకు అసౌకర్యం వుండరాదు. ఇంటిలో సీటింగ్ కెపాసిటీ పెంచటానికి కేన్ స్టూల్స్ బయట కూడా పడేసి వుంచండి. అనుకోకుండా అతిధులు అధికంగా వస్తే ఉపయోగపడతాయి. బీన్ బ్యాగ్స్ లేదా వుడెన్ బల్లల తో పోలిస్తే ఇవి చవక. ఒక్కొక్కటి రూ.500 లకే వచ్చేస్తాయి. కేన్ కుర్చీలతోపాటు గ్లాస్ టాప్ వున్న టేబుల్ కూడా వేయండి. డైనింగ్ రూమ్ లో చాలా బాగుంటాయి. ఇంటిలో అంతా కేన్ ఫర్నిచరే ఉపయోగిస్తూంటే, కొన్ని ల్యాంప్ షేడ్లు కూడా కేన్ తయారీ గలవి కొనండి. ఇవి వివిధ డిజైన్లలో వస్తున్నాయి. ఫర్నిచర్ తో కలిపి ఇవి బాగుంటాయి.
భారతదేశంలో మంచి కేన్ అస్సాం రాష్ట్రం నుండి వస్తుంది. కేన్ మెటీరియల్ తో పెన్ హోల్డర్స్ నుండి టెలిఫోన్ స్టాండ్ వరకు అన్ని పరికరాలు వస్తున్నాయి. అయితే, మార్కెట్ లో చవకగా దొరికే కేన్ మన్నికనీయదు. దాని జోలికి పోకండి. కేన్ ఫర్నిచర్ సహజ ప్రకృతి వాతావరణానికి సరిపడి వుంటుంది. చవకగా వచ్చే ఈ ఇంటి అలంకరణ చూడటానికి ఎంతో బాగుండటమే కాక మీ జేబుకు భారీగానూ వుండదు.



Click it and Unblock the Notifications