Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గార్డెన్ లో దీపాల అలంకరణలు!

రోప్ లైటింగ్ - ఒక నవ్వారు వంటి తాడుకు వరుసలో చిన్నపాటి బల్బులు వైరింగ్ చేస్తారు. సాధారణంగా గార్డెన్లకు వీటితోనే అలంకరణ చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఊదారంగు మొదలైన వివిధ రంగుల్లో ఈ బల్బులు వుంటాయి. చెట్టు కాండానికి లేదా కొమ్మలకు వాటి ఆకారాలలో వీటిని కట్టవచ్చు.
ఫెయిరీ లైట్స్ - ఇవి కూడా చిన్నపాటి బల్బులే. వీటిని కూడా గార్డెన్ లో దీపాల అలంకరణగా వాడితే మంచి అందంగా వుంటుంది. కాంతివంతమైన వెలుగులు విరజిమ్ముతూంటాయి. వీటిని చెట్టు కొమ్మలకు వేలాడదీయండి. లేదా చిన్న మొక్కలకు, పొదలకు వీటిని చుట్టండి. వీటిని నేలపై కూడా పెడితే, గార్డెన్ లోకి ప్రవేశించేవారికి దారి బాగా కనపడుతుంది.
లాంతర్లు - లాంతర్లు చాలా పురాతనమైనవి. ఇపుడు ఈ లాంతర్లలో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టి వెలిగిస్తున్నారు. పురాతనమైనవైనప్పటికి, లాంతర్లను గోడలకు లేదా చెట్లకు వేలాడదీస్తే ఎంతో ఆకర్షణీయంగాను, విభిన్నంగాను వుంటుంది. మరో అయిడియాగా లాంతర్లలో కేండిల్స్ కూడా వెలిగించి పెట్టవచ్చు. అయితే, వీటికి గాలి తగులరాదు.
ప్రమిదల దీపాలు - సాధారణంగా ఇంటిలో పెట్టినట్లే, గార్డెన్ లో కూడా కరెంటు ప్రమిదల దీపాలు వెలిగించి ఆనందించవచ్చు. ఇవి కూడా సాంప్రదాయకంగా వుండి గార్డెన్ లో పండుగ వాతావరణాన్ని చూపిస్తాయి.
ఈ దీపావళి పండుగకు మీ అందాల తోటను పైన తెలిపిన విధంగా అలంకరించి ఆనందించండి.



Click it and Unblock the Notifications