Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కంటికి ఇంపైన ఇంటిగోడల అలంకరణ!

ప్రతి ఇంటీరియర్ అలంకరణ వెనుక ఒక ప్రధాన భావన వుంటుంది. మీ ఫొటోగ్రాఫుల ఏర్పాటు ఒక కధలా వుండాలి. ఒక ఫొటోలో ఆనందదాయక కుటుంబాన్ని చూడాలనుకుంటే తల్లి, తండ్రి వీరితోపాటు అటు, ఇటు పిల్లలు వుండాలి. లేదంటే, కుటుంబ సభ్యలందరూ కలసిన ఫొటో వుండాలి వయసులను బట్టి ఏదో ఒక పద్ధతిలో వుండాలి. ఫొటోలు ఎలా పెట్టినా మీ ఏర్పాటు వెనుక ఒక లాజిక్ వుండాలి.
ఫ్రేములతో అలంకరణ చేసేటపుడు వివిధ సైజుల ఫొటోలు ఉపయోగించండి. ఒకే సైజు ఫొటోలు చూసేవారికి విసుగు పుట్టిస్తాయి. పైగా అన్ని గోడలకు ఒకే సైజు ఫొటోలు కూడా బాగుండవు. ఒక పెద్ద గోడకు చిన్నపాటి 6 x 6 అంగుళాల ఫొటో ఫ్రేము పెట్టలేరు. అదేవిధంగా ఒక పెద్ద ఫొటోను ఒక చిన్నగోడకు పెట్టటం కూడా అంత బాగుండదు. గుండ్రం, ఓవల్, చతురస్రం, దీర్ఘ చతురస్రం ఫొటోలు ఆసక్తికరంగా వుంటాయి. ఫ్రేము సైజును బట్టి మీ ఫొటో పెద్దది లేదా చిన్నది చేయవచ్చు. ఒక లేటెస్ట్ ఫొటో ముందుగా వుంచి, అదే వరుసలో గత చరిత్రను గుర్తు చేసే ఫొటోలు పెడితే ఆ వ్యక్తికి సంబంధించి ఒక స్టోరీలా వచ్చేస్తుంది. ప్రత్యేకించి మీ గ్రాండ్ పేరెంట్స్ వంటి వారికి ఈ ఏర్పాటు బాగుంటుంది. బెడ్ రూమ్ లోకి ప్రవేశించగానే అక్కడ గోడలకున్న బొమ్మలు అది ఎవరి గదో వెంటనే తెలియపరచాలి. ఆ గదిలో వుండే వారి బొమ్మలు అధికంగా వుండాలి. ఆ వ్యక్తి ఇతరులతో కలసి వివిధ సమయాలలో తీయుంచుకున్న ఫొటోలు సైతం పెట్టవచ్చు.
ఫొటో ఫ్రేములు పెట్టేటపుడు వాస్తు పరంగా కూడా జాగ్రత్త పడండి. ఆనందాలు చిందించే కుటుంబ సభ్యుల ఫొటో లివింగ్ రూమ్ లో వుండటం సరికాదంటారు. ఇంటికి వచ్చిన అతిధులకు మీ ఆనందాల హరివిల్లుపై చెడుకన్ను పడితే చెడు కలుగగలదని భావిస్తారు. అదే విధంగా ఈ రకమైన ఫొటో నైరుతిమూలగల మాస్టర్ బెడ్ రూమ్ లో నైరుతి దిశగా పెడితే కుటుంబ యజమానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నియమాలు, మీకు తెలిసినట్లయితే, పాటించడం మంచిదే.



Click it and Unblock the Notifications