Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దీపావళికి లైట్ల అలంకరణ ఎలా?

ఎలక్ట్రానిక్ లైట్ల అలంకరణ వలన ప్రయోజనాలు పరిశీలిస్తే....
మొదటగా, అలంకరణ చేయటం చాలా తేలిక. స్విచ్ వేయటం వరకే చాలు. వాటికి నూనె పోయనక్కర లేదు. ఆరిపోతాయనే భయం లేదు. వాటిలో మంట వుండదు కనుక కొంతమేరకు సురక్షితం కూడాను. దీపావళి కొత్త దుస్తులు మంటకు అంటుకుంటాయన్న భయం లేదు. గతంలోని నూనె ప్రమిదలకంటే కూడా వివిధ డిజైన్లలో ఎలక్ట్రానిక్ దీపాలు వస్తున్నాయి. కనుక ఈ లాభాలన్నీ పరిశీలిస్తే, ఇక పండుగకు లైట్లు ఎపుడు పెట్టేద్దామా అని కూడా మీకు అనిపించవచ్చు. ఆ అలంకరణకు అవసరమైన కొన్ని సూచనలు చూడండి. మార్కెట్ లో ఎలక్ట్రానిక్ బల్బుల తోరణాలు రెడిగా లభ్యమవుతాయి. ఇంటి బయట పెట్టటానికి ఈ లైటింగ్ బాగుంటుంది.
ఇపుడు ఈ లైట్ల తోరణాలలో ఆరి వెలిగేవి, నిరంతరం వెలిగేవిగా వుండే బల్బులు వివిధ రంగులలో వస్తున్నాయి. బల్బులు పైకి కనపడకుండా ట్యూబులలో వుండే విధంగా వస్తున్నాయి. అటువంటివి కొనుగోలు చేస్తే ఇంటి బయట వాటిని ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారానికి అలంకరణ చేసుకోవచ్చు. డిస్కో ఎఫెక్టులనిచ్చే లైట్లు కూడా వస్తున్నాయి. సాంప్రదాయక లాంతర్లలో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టి కూడా కొత్తగా తయారు చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి కొనుగోలుకు లభిస్తున్నాయి.
కొత్తగా వస్తున్న పేపర్ లాంతర్లు చాలా ఆకర్షణీయంగా వుంటున్నాయి. తోరణాలమధ్య అక్కడక్కడా లాంతర్లు పెడితే అలంకరణ చాలా బాగుంటుంది. మరింత ఆకర్షణ కొరకు ఎలక్ట్రానిక్ బల్బులపై మనకు నచ్చిన రంగు పేపర్లను కూడా చుట్టవచ్చు. కనుక ఆధునిక లైటింగ్ అలంకరణలు మీ ఇంటి ముంగిట చేసి హైటెక్ అనిపించుకోండి.



Click it and Unblock the Notifications