For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైనో ‘లోగిలి ’.. సంతోషాల ‘కడలి’..

|

Home Decoration
మన ఇంటిల్లిపాది సంతోషంలో అందం, పరిశుభ్రత వంటి అంశాల కీలక పాత్ర పోషిస్తాయి... అందమైన బెడ్ రూమ్ అన్యోన్య జీవితాన్ని సుఖసాగరంలో నడిపిస్తుందట... అలాగే మీ చిన్నారులకు కోసం తీర్చిదిద్దిన రూమ్ ను వినూత్నంగా అలంకరిస్తే వారి సంతోషాలకు అవధులుండవట...

మీ అభిరుచులకు అనుగుణంగా మీ బెడ్‌రూమ్‌ను తీర్చుదిద్దుకోండి.. మీ పిల్లల ఆసక్తికి అనుగుణంగా వారి రూమ్‌ను అలకరించండి. మీ డ్రాయింగ్ రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. మీ హాలులో ఏవిధమైన సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటే బాగుంటుంతో థింక్ చేయండి. చక్కటి సోఫాలు, కళాత్మకమైన పెయింటింగ్‌లు, మంచి మ్యూజికల్ సిస్టం, అద్భుతమైన టీవి, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, నేల పై సుతి మొత్తని తివాచీలు.. ఇవన్ని చూసి మీ పక్కింటి వారికి ఆసూయ కలగాలి.

ఇంటికి వచ్చిన అతిథులు ఆశ్చర్య పోవాలి, ఇంత అందమైన వస్తువులు ఎక్కడ కొన్నారంటూ మిమ్మల్ని అడగాలి.., మాకు కూడా ఇటువంటికి కొనిపెట్టండంటూ మిమ్మల్ని అడిగే విధంగా మీరు డెకరేషన్‌ను అదరగొట్టాలి. ఇంట్లో రూముల గురించే కాకుండా ఫోర్టుకో, ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు గురించి శ్రద్ధ తీసుకోండి.

మీ ఇంటి వరండాలోనూ, ఇంటి ముందువున్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కోసం కేజ్‌లు ఏర్పాటు చేయండి. వాటిలో రంగు రంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు లాంటివి తెచ్చి పెట్టండి. తాబేళ్లు, కుక్కలు, కేందేలులాంటి జంతువులు కూడా మీ ఇంటి అందాన్ని పెంచుతాయి. సమాజంలో మీకు, మీ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి.

మీ ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదద్డడానికి మీ ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన మీరు కలిగి ఉంటారు. మీ ఇంట్లోని ప్రతి గదిలో ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశం మీ అభిరుచికి తగినట్టు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్న పిల్లల బొమ్మలు, లైటింగ్ టైబుల్స్, షాండ్లియర్, ప్లవర్ పాట్స్ లాంటివి అమర్చండి. చూసిన వెంటనే ఆకట్టకునే విధంగా అలంకరించండి.

గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును ప్రతిబింభించే విధంగా బల్బులను అమర్చండి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దాని పై ఫ్లవర్ బేసిన్‌ను పెట్టండి. రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్‌లో నీళ్లు పోసి దాని పై రంగు రంగుల అందమైన పూలను అమర్చండి. మీ ఇంటి కోసం మీరు చేసే ప్రతి పని అందాన్ని పెంచే విధంగా ఉండాలి. చూసిన వారు మెచ్చుకునేలా ఉండాలి. అప్పుడే మీరో గొప్ప 'ఇంటీరియర్ డెకరేటర్ ' అవుతారు. మీ ఇల్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంటుంది.

English summary

Dream Home Decoration | అందాన్నిచూసి అబ్బురపోవాలంతే..

If you love decorating... If you're always on the hunt for fresh home decorating ideas... plz read this..
Story first published:Wednesday, August 10, 2011, 15:33 [IST]
Desktop Bottom Promotion