Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గృహాలంకరణలో ప్రధాన ఆకర్షణలు!

1. గణేశ విగ్రహం - చక్కటి అభయాన్నిచ్చే గణేశ విగ్రహం ఇంట్లో లేకుంటే ఇంటి అలంకరణ ఎంత చేసినా చేయనట్లే. వీలైనంత వరకు గణేశ విగ్రహాన్ని ఇంటి పూజా గది లో వుంచండి. లేదంటే లివింగ్ రూమ్ లో శుభ సూచకంగా ఒక వైపుగా కూడా బాగానే వుంటుంది. ఇపుడు విగ్రహాలు వివిధ రకాల మెటీరియల్స్ తో తయారు చేస్తున్నారు. మీకు అనుకూలమైంది గది సైజును బట్టి ఎంచుకోండి.
2. పవిత్రమైన తులసి మొక్క - గతంలో పూజలకు ప్రధానమైన ఈ మొక్క పెరటిలో వుండేది. నేటి రోజులలో పెరడు వుండటం లేదు గనుక మీ బాల్కనీ లేదా ఇంటి ముందు భాగంలో ఆకర్షణీయమైన కుండీలో తులసి మొక్కను మెయిన్ టెయిన్ చేయండి. దాని ముందు నూనెతో వెలిగించిన దీపాన్ని పెడితే చూడటానికి అందంగానూ వుంటుంది. ఇంటిలోని చెడు శక్తులను కూడా తరిమేస్తుంది.
3. నేల సీటింగ్ - సాధారణంగా మన ఇండ్లలో సోఫాల కంటే కూడా నేలపై కూర్చోటానికి ఇష్టపడతారు. లివింగ్ రూమ్ కు ఒక మూలన ఆకర్షణీయమైన మేట్రెస్ వేసి దానిపై వివిధ రంగులు శాంతినికేతన్ వంటి అరుదైన డిజైన్లు కల కవర్లతో కుషన్లు వేసి వచ్చిన అతిధులకు కూర్చునేటందుకు సౌకర్యం కల్పిస్తే అద్భుతంగా వుంటుంది.
4. నటరాజ విగ్రహం - ఇది ఎప్పటికి నూతనత్వాన్ని ఇచ్చేదే. కళా నైపుణ్యతగల లేపాక్షి చేతి పనులతో కూడిన ఇత్తడి నటరాజ విగ్రహాన్ని ఇంటికి వచ్చిన వారికి బాగా కనపడేలా అమర్చండి. లేదా ఆకర్షణీయమైన రంగులతో కూడిన కృష్ణుడి విగ్రహం కూడా ఏ ఇంటికైనా సరే చక్కటి అందాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications