Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి అలంకరణలో పూలు...కొన్ని పద్ధతులు!

పూలు ఇంటిలో అలంకరించే విధానం ఎప్పటికపుడు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఆధునికంగా వచ్చే బూకేలు, పూలగుత్తులు వివిధ డిజైన్లలో తయారు చేస్తున్నారు. మీరు చేసే పూల అలంకరణ ఆదునిక కళలను ప్రతిబింబించాలి. సాధారణమైన పూవులు వాడేకంటే, వివిధ రకాల రంగులుకల పూలు గుత్తులుగా కట్టి మీరు అలంకరించాలనుకున్న స్ధలాలలో వుంచండి. మీ ఫర్నిచర్ కూడా లైట్ కలర్స్ లో వుంచండి. సన్ ఫ్లవర్ ఎల్లో లేదా కేమేలియా పింక్ గోడలకు మీరు అలంకరించే పూలు ఎంతో అందాన్నిస్తాయి. మొదటగా ఈ అలంకరణలు పిల్లల గదిలో చేయండి, ప్రత్యేకించి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల వుంటే, ఈరకమైన పూల అలంకరణ బాగుంటుంది.
వేలాడే పూల కుండీలు వస్తున్నాయి. వాటిలో వివిధ రంగుల పూలను పెట్టి కొన్ని అనువైన మూల ప్రదేశాలలో లివింగ్ రూమ్ సీలింగ్ పై వేలాడ దీస్తే ఆకర్షణీయంగా వుంటుంది. వెడల్పాటి ఒక గిన్నెలో నీరు పోసి దానిలో వివిధ రంగుల పూలను వేసి ప్రవేశ ద్వారం వద్ద పెడితే ఆకర్షణీయంగా వుంటుంది. ఇంటికి చేసే పూల అలంకరణలో తాజాపూలే కాదు, ఎండిన పూలు కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఫొటో ఫ్రేములపై అంటించడం, గోడలపై వేలాడదీసే విధంగా వాటిని అమరిక చేయటం చేయవచ్చు.



Click it and Unblock the Notifications