Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమను చాటే హార్ట్ షేప్ బెడ్ రూమ్ అలంకరణ!

మీ బెడ్ రూమ్ అలంకరణలకు హార్ట్ షేపు ఎలా వినియోగించాలా చూద్దాం....
1. బెడ్డింగ్ - హార్ట్ ఆకారంలో వున్న తలగడలు లేదా కుషన్లు హార్టు షేపు చిత్రించబడిన బొమ్మలు బెడ్ షీట్లు లేదా రజాయిలకు వేస్తే గది అలంకరణ బాగుంటుంది. బెడ్ రూమ్ లో బెడ్ ప్రధానమైంది కనుక దానిపై వీటిని వేస్తే అలంకరణ అయినట్లే.
2. కర్టెన్లు - హార్ట్ లు ఎపుడూ కార్టూన్ లుగా వుండనవసరంలేదు. ఒక మాదిరి గీతలుగా వున్నా బాగానే వుంటుంది. కర్టెన్లు హార్టు ఆకారంలో వుంటే...బయటనుండి పడే వెలుగు హార్టు షేపులో నీడపడి బాగుంటుంది.
3. గోడల చిత్రాలు - అలంకరణలు ఎపుడూ మార్చాలనుకునేవారు గోడలను నలుపు, తెలుపు లేదా ఎరుపు రంగులతో హార్ట్ షేపులను వేసి గదిలోని ఫర్నిచర్ తో మ్యాచ్ చేయవచ్చు. పింక్, వైట్ మరియు రెడ్ రంగుల కాంబినేషన్ హార్ట్ షేపులో వేస్తే చాలా బాగుంటుంది.
4. గదిలోని టేబుల్ పైన హార్ట్ షేపులో వున్న కొన్ని వస్తువులు, గ్రీటింగ్ కార్డులు, ఎర్రటి పూలు వంటివి లేదా ఎరుపురంగు హార్టు షేపు కల మ్యాట్ గోడకు వేలాడదీయటం లేదా హార్టు షేప్ లో వున్న కార్పెట్ మొదలైనవి అలంకరణగా వుంటాయి.
5. రూమ్ లోని వస్తువులు - సువాసన నిచ్చే హార్ట్ షేపు క్యాండిల్స్, ల్యాంప్ షేడ్స్, టిష్యూ బాక్సులు, ఇతర సువాసన ద్రవ్యాలు వంటివి తక్కువ ఖర్చుతో హార్టు షేప్ అలంకరణకు ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications