For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగల సీజన్.... ఇంటి అలంకరణలు!

By B N Sharma
|
Home Decor Ideas To Set A Festive Mood
దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. వరలక్ష్మీ వ్రతం, గణేష్ చతుర్ధి పండుగలయ్యాయి. దసరా, దీపావళి రానున్నాయి. పండుగ వాతావరణంలో విందులు, వినోదాలు, స్నేహితులు, బంధువులు ఒకరింటికి మరొకరు వెళ్ళి ఆనందించడాలు ఎన్నో వుంటాయి. పండుగ వాతావరణంలో ఇంటి అలంకరణ ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఇంటి అలంకరణ సరిగ్గా లేకపోతే, ఇంట్లోనివారి మనోభావాలు సైతం వెనుకంజ వేస్తూ వుంటాయి. ఇంటి అలంకరణ బంధువులు, స్నేహితుల కొరకే కాదు, ఇంట్లోని సభ్యులకు కూడా కావాలి. కనుక ప్రధానంగా ఇంటి అలంకరణ పండుగ వాతావరణంలో ఒక భాగం అని కూడా చెప్పవచ్చు. ఇల్లు సింపుల్ గా అలంకరించుకోవాలంటే కొన్ని చిట్కాలు సూచిస్తున్నాం. పరిశీలించి ఆచరించేందుకు ప్రయత్నం చేయండి.

5 పండుగ ఇంటి అలంకరణలు -

1. తోరణాలు - ఏ పండుగ జరిగినా ప్రధాన ద్వారానికి మామిడాకు తోరణాలు కట్టటం మన సంప్రదాయం. వీటితోపాటు ద్వారానికి లేదా గేటుకు పూలదండలు కూడా కడితే ఇంటిలోని వారికి బయటవారికి కూడా పండుగ వాతావరణం వచ్చేసినట్లే. ప్రధాన ద్వారం అలంకరిస్తే, ఎంతో పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. ఇంటిలోకి వచ్చేవారికి చాలా ఆహ్లాదంగా కనపడుతూంటుంది. మామిడాకులు క్రిములను దూరంగా వుంచి మనో భావాలను సవ్యం చేస్తాయి.

2. పండుగ అలంకరణ అనే సరికి ఇంటికిఖరీదైన వస్తువులు కూడా కొనాల్సిన పనిలేదు. శుభ్రంగా వున్న చక్కగా మడచిన కుషన్ కవర్లు, పక్క బట్టలు మంచి ఆలోచనలను, సవ్యమైన తీరును కలిగిస్తాయి. పండుగ అలంకరణలైన, పూలు, ముగ్గులు, దీపాలు మొదలైనవి ఇంటికి కొత్త కళను తెచ్చిపెడతాయి.

3. సువాసనలు - పూజాగదిలో వెలిగించే కర్పూరం, అగరబత్తీలు మొదలైన సువాసన ద్రవ్యాలు పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తూవుంటాయి.

4. ప్రధానంగా వంటగదిలో తయారయ్యే తిండి పదార్ధాల ఘుమఘుమలు మరింత ఆకర్షణగా వుండి నోరూరించేస్తూవుంటాయి. డైనింగ్ టేబుల్ అన్నిటిని మించిన ఆకర్షణ. అందరూ కలసి తినే కుటుంబం ఎపుడూ కలిసే వుంటుందంటారు. కనుక బాగా తిండిపదార్ధాలతో నింపబడిన టేబుల్ పండుగ వాతావరణాన్ని పూర్తి చేస్తుంది.

5. ఇంటిలో తయారయ్యే పిండివంటలు కూడా రుచిగా వుండటమే కాదు. కంటికి ఇంపుగా కనపడాలి. వాటి రంగులు సైతం తినేవారికి నోరూరించేవిగా వుండాలి. చక్కటి సిల్వర్ కాగితాలు స్వీట్లకు చుట్టటం, మసాలాలు, తాలింపుల వాడకం మొదలైనవి తిండిపదార్ధాలను చూపులకే కాదు ఆకలి అంటూ తినేందుకు సైతం ప్రోత్సహిస్తాయి.

English summary

Home Decor Ideas To Set A Festive Mood | పండుగల సీజన్.... ఇంటి అలంకరణలు!

Food Presentation Ideas – Even if you make tasty food, it should look attractive to the eyes. Presentation of food with silver foil, garnishes, seasoning will make the for look colorful and attractive. It is said that the color of the food has lots to do with a person's appetite.
Story first published: Monday, September 12, 2011, 15:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more