For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి అలంకరణ బాగుంటే... ఉల్లాసం!

By B N Sharma
|

Living
లివింగ్ రూమ్ అలంకరణ బాగుండాలంటే, సాధారణంగా ప్రతి ఇంటిలో వుండే సోఫా సెట్టును ఒక మూలగా వేయండి. సోఫా సెట్టుకు మధ్యలో గుండ్రటి టీపాయ్ వేస్తే బాగుంటుంది. ఇక గదంతా విశాలంగా ఉంటుంది. అలాగే సోఫాల పక్కన చిన్న పూలకుండీని ఉంచితే.. మరింత ఆకర్షణనిస్తుంది.

గదిలో నాలుగు గోడలూ అందంగా కనపడాలంటే, బజారులో దొరికే సీనరీలు లేదా మీ కిష్టమైన నటీనటులు, బేబీలు మొదలైన ఫొటోలున్న పోస్టర్లు తెచ్చి ఒక గోడకు అంటించండి. సోఫాకు దగ్గరగా కుటుంబ సభ్యులందరి ఫొటోలు గోడపై పెడితే ఇంటికి వచ్చిన అతిధులను అవి బాగా ఆకట్టుకుంటాయి. అయితే.. వాటిని ఎప్పటికప్పుడు డస్టింగ్ చేస్తూ వుంటే దుమ్ము పోయి కొత్తగా కనపడుతూంటాయి. రంగు రంగుల పూలుకల కర్టెన్లను డోర్ లకు, కిటికీలకు వేస్తే గదిలో కావలసినంత మేరకే వెలుగు వస్తూ బాగుంటుంది.

గదిమధ్యలో లేదా సోఫా సెట్టు వేసిన చోటే గది గోడలు, కర్టెన్ల రంగులకు మ్యాచ్ అయ్యే కార్పెట్ వేస్తే అది ఆధునిక అలంకరణను ప్రతిబింబిస్తుంది. అలాగే ఇంట్లో మూల చిన్న బల్ల వేసి పెద్ద పెద్ద కొవ్వొత్తులు, లేదా మీకు నచ్చిన బుద్ధుడు, నటరాజు లేదా క్రిష్ణుడి బొమ్మలుఉంచితే చూడచక్కగా వుంటుంది. వీటికి బదులుగా ఫ్లవర్ వేజ్ లేదా నిజమైన పూలు కల కుండీ ఒకటి పెడితే ఇక ఇంటికి సింపుల్ ఆకర్షణ పూర్తయినట్లే.

English summary

Home Starts with a Simple Decoration! | ఇంటి అలంకరణ బాగుంటే... ఉల్లాసం!

A Well decorated house gives lot of happiness and enjoyment for the members of family. Decoration can be made in a most inexpensive way also. A simple Sofa Set in the living room, attractive curtains to doors and windows, a carpet and some Photo frames will beautify the house beyond your expectations.
Story first published:Saturday, November 12, 2011, 17:41 [IST]
Desktop Bottom Promotion