Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బెడ్ రూమ్ పై ఆసక్తి కలగాలంటే.... !

1. బెడ్ రూమ్ లో బెడ్స్ ను సాధారణంగా చాలామంది కప్ బోర్డు పక్కగానే లేక రూమ్ లో ఒక మూలగానో వేస్తారు. దీనితో ఆకర్షణ లేకుండా బెడ్స్ ఒక మూల పడి వుండటంతో లేదా కప్ బోర్డు బట్టలన్నీ దానిపై పడేస్తే, బెడ్స్ ఉపయోగించాలనే ఆసక్తి పోతుంది. కనుక వాటిని గది మధ్యలో ఆకర్షణీయంగా అమర్చండి.
2. డ్రెసింగ్ టేబుల్ - కొంతమంది బెడ్స్ పక్కన డ్రెసింగ్ టేబుల్ పెడతారు. దీనిపై గల పౌడర్, సెంట్ మొదలైనవన్ని బెడ్స్ పైకి కూడా చేరి బెడ్ ను పాడు చేసే ప్రమాదం వుంది. వాస్తు మేరకు బెడ్ అద్దంలో కనపడరాదు. కనుక రూమ్ లో ఒక మూల డ్రెసింగ్ టేబుల్ కు కేటాయించండి.
3. స్విచ్ బోర్డులు - వీటిని రూమ్ ఎంట్రన్స్ లో పెడతారు. లైట్లు, ఫ్యానులు తీయాలన్నా , వేయాలన్నా బెడ్ పై కూర్చున్నవారికి అసౌకర్యం కాగలదు. కనుక వీటిని బెడ్స్ దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది.
4. బెడ్ రూమ్ లో లైటు ఏర్పాటు - అధికమైన వెలుగునిచ్చే లైట్లు రూమ్ లో ఉంచరాదు. ఇవి మీ నిద్రను పాడు చేయటమే కాక, కండ్లకు హాని చేస్తాయి. బెడ్ రూమ్ లో చదువుకొనే వారయితే, టేబుల్ ల్యాంప్ ఏర్పాటు చేసుకోండి. సాధారణమైన తక్కువ కాంతి నిచ్చే లైట్లు బెడ్ రూమ్ లో బాగుంటాయి.
5. ఫ్లోరింగ్ - వేడి ప్రదేశాలైతే, మార్బుల్ లేదా గ్రానైట్ ఫ్లోరింగ్ బాగుంటుంది. చలి ప్రదేశాలకు వుడ్ లేదా టైల్స్ బాగుంటాయి. ఏ రకమైన ఫ్లోరింగ్ వున్నప్పటికి, కార్పెట్ లేదా మ్యాట్ వంటివి వేసి కాళ్ళకు సాక్స్ వంటివి లేదా స్లిప్పర్లు వేసుకుంటే సౌకర్యంగావుంటుంది.
ఈ ఏర్పాట్లతో అన్ని హంగులు వున్న బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకుంటే దానిని ఉపయోగించటంలో ఎంతో ఆసక్తి కనబరుస్తారు.



Click it and Unblock the Notifications