Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ కళలాడే ముచ్చటైన ముంగిట!

ఎంట్రన్స్ షేడ్ - ప్రతి ఇంటికి ఎంట్రన్స్ షేడ్ ఒకటి తప్పక వుండాలి. ఇది ఇంటిలోకి నీరు రాకుండా, ఎండ బాగా పడకుండా నివారిస్తుంది. ప్రవేశ ద్వారం పాడవకుండా కూడా చేస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద ఒక పాకే మొక్కను పెంచితే ఇంటి మొత్తానికి మరింత అందం వస్తుంది.
డోర్ మ్యాట్ - ఇంటి ముంగిట అత్యవసర వస్తువు డోర్ మ్యాట్. ఇల్లు పరిశుభ్రంగా వుంటుంది. వచ్చిన అతిధి కాళ్ళు తుడుచుకొని లోపలికి రమ్మని సూచిస్తుంది. వీటిలో ఎన్నో రకాలు, ఎన్నో డిజైన్లు. స్వాగతం అని కూడా రాసి వుంటుంది. ఇంటిలోపలి అలంకరణకు తగినట్లు దీనిని ఎంపిక చేయండి.
హుక్ - ప్రవేశ ద్రవారం లోపలివైపు హుక్ లు వున్న ఒక చెక్కను వేలాడదీస్తే, ఇంటినుండి బయటకు వచ్చేటపుడు లేదా బయటనుండి లోపలికి ప్రవేశించేటపుడు అందిపుచ్చుకునే అంబరెల్లా, హేండ్ బేగ్, హెల్మెట్ వంటివి తగిలించుకోవడానికి బాగుంటుంది. మరచిపోవటం జరగదు.
మిర్రర్ - ఇంటినుండి బయటకు వచ్చేటపుడు సాధారణంగా ప్రతివారూ అద్దంలోకి చూసుకొని బయటకు వస్తారు. కనుక ప్రవేశ ద్వారం లోపల ఒక మంచి డిజైన్ గల మిర్రర్ పెడితే...అలంకరణ మరియు ఉపయోగంగానూ వుంటుంది.
ఛైర్ లేదా టేబుల్ - గార్డెన్ ఛైర్ ఒకటి వేస్తే అలంకరణగాను, ఎవరైనా వచ్చినపుడు తాత్కాలికంగా కూర్చోనేందుకు, షూస్ లేదా సాక్స్ వంటివి వేసుకునేటందుకు ఉపయోగంగాను వుంటుంది. దీనికి గాను పురాతనమైన డిజైన్లు కల ఒక వుడెన్ ఛైర్ వేసినా బాగుంటుంది.
మీ ఇంటి ముంగిట అలంకరించాలంటే సులభమైన ఈ అలంకరణలు ఆచరించండి.



Click it and Unblock the Notifications