Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
జీవనశైలి అట్టహాసాన్ని తెలియజేసే సోఫా అలంకరణలు!

1. సింధటిక్ ఫైబర్ సోఫాలు: మీ లివింగ్ రూమ్ కు బాల్కనీ వుంటే, లేదా పోర్టికో లేదా టెర్రస్ గార్డెన్ లోకి దోవ వుంటే, ఈ రకమైన సింధటిక్ ఫర్నిచర్ బాగుంటుంది. సింధటిక్ ఫర్నిచర్ వర్షమొచ్చినా పాడవదు. దుమ్ము పడదు, తేలికైన ఫర్నిచర్, మొదలైన సౌకర్యాలతో మంచి ఆకర్షణీయంగా వుంటుంది. తెలుపు, లేదా వుడ్ కలర్ లో బాగుంటాయి. చెక్కవాటంతటి బలమైనవి కావు కానీ ఫైబర్ తో చేయబడినవి కనుక బాగానే మన్నికనిస్తాయి.
2. వుడెన్ సోఫాలు: ఇవి కొత్తవైనా పాతవైనా సాంప్రదాయకంగా బాగా వుంటాయి. దీర్ఘకాలం మన్నుతాయి. గదిలో ఏ అలంకరణ వున్నప్పటికి అందులో ఇమిడిపోతాయి. నేటిరోజుల్లో మలేషియా రబ్బర్ వుడ్ సోఫాలు వివిధ డిజైన్లలో వస్తున్నాయి. వుడెన్ సోఫాలు మన భారతీయ శైలిలో దివాన్లు లేదా సోఫా కం బెడ్ లుగాను కూడా వాడవచ్చు.
3. లెదర్ సోఫాలు: సోఫా కం బెడ్ కావాలనుకుంటే లెదర్ వి బాగుంటాయి. ఎక్కువ స్ధలం ఆక్రమిస్తాయి. ఎంతో వెచ్చగా వుండి శీతాకాలంలో ఇంట్లో సభ్యులకు మంచి సౌకర్యాన్నిస్తాయి. ఇవి వివిధ రంగులలో గుడ్డ కుషన్లతో వస్తున్నాయి. ఇవి వేస్తే, ఇంటికి మంచి ధనిక తరహా అలంకరణ కనపడుతుంది.
4. అల్యూమినియం సోఫాలు: బదిలీలు అయ్యేవారు, అద్దె ఇంటివారు, తరచుగా ఇల్లు మారాలనుకునేవారికి అల్యూమినియం ఫర్నిచర్ తేలికగా వుండి బాగుంటుంది. ఇవి చాలాకాలంనుండి వున్నప్పటికి, నేటికీ బాగానే ఉపయోగిస్తున్నారు. వీటిలో రంగు రంగుల కుషన్లు వేసి ఇంటి అలంకరణకు మ్యాచ్ చేయవచ్చు.
5. గుడ్డ సోఫాలు: అట్టహాసంగా అలంకరణ వుండాలనుకునేవారికి ఇవి పనికివస్తాయి. లివింగ్ రూమ్ లో బాగుంటాయి. ఏ అలంకరణకైనా ఇవి తేలికగా సరిపోతాయి. సోఫాకు పైనగల క్లాత్ ను గదిలోని ఇతర రంగులకు అనువుగా మార్పు చేసుకోవచ్చు. కనుక ఏ గదికైనా సరే అలంకరణలో భాగంగా క్లాత్ సోఫాలను వాడవచ్చు.
తెలుపబడిన సోఫా సెట్ రకాలు లివింగ్ రూమ్, ఇతర రూమ్ లకు కూడా ఎంతో బాగుంటాయి. కొత్తగా సోఫాలు కొనేవారికి, ఇంటిని చక్కగా అలంకరించాలనుకునేవారికి ఈ చిట్కాలు సరిపోతాయి.



Click it and Unblock the Notifications