Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చిన్న ఇంటికే అద్భుత అలంకరణ!

చిన్న ఇంటిని అలంకరించాలంటే, ప్రధానంగా అలంకరణల ఫర్నిచర్ వదిలేయండి. వాడుకలో వున్న వస్తువులు ఎంపిక చేయండి. ఉదాహరణకు పెద్ద సోఫా వేసే కంటే, ఇపుడు వాడుకలో వున్న బీన్స్ బేగ్ మీ చిన్న ఇంటికి ఎంతో సౌకర్యంగా వుంటుంది. అవసరపడితే వరుసగా 4 బీన్ బేగ్స్ వేయండి. స్ధలం తక్కువ కనుక, మీరు చేయాలనుకున్న అలంకరణలు గోడలకు చేయండి. క్లిప్స్ తో కూడిన గ్లాస్ హోల్డర్లు బిగించి వాటిపై షోపీసులు పెట్టండి. మీ ఇంటిలోని టెలివిజన్ గోడకు ఏర్పాటు చేయండి. ఏ పని చేసినప్పటికి నేలమీద జాగా ఖాళీగా వుండేలా చూడండి.
మీ ఇల్లు మీ అభిరుచులను వెల్లడించాలి. సెలిబ్రటీల ఇండ్ల స్ధాయి కాకపోయినా, మీ అభిరుచులకు తగినట్లు, సౌకర్యవంతంగా వుంటే, మీ ప్రతిభ అందులో బయటపడుతూనే వుంటుంది. ఇతరులను ఆనందపెట్టటానికి కాదని, మీకు మీ ఇల్లు ఆనందం కలిగించటానికని గుర్తుపెట్టుకోండి.
చిన్నదైన ఇల్లు లేదా అపార్టుమెంటుకు అందం కన్నా గానీ సౌకర్యం ప్రధానం. మీ కవసరమైనవి అందుబాటులో వుండాలి. చిన్న ఇండ్లలో అలవి కాని పెద్ద ఫర్నిచర్ వస్తువులు నివసించే వారికి సౌకర్యాన్నివ్వవు. పెద్ద పెద్ద పెయింటింగ్ లు పెట్టే కంటే, మీ చిన్ననాటి కాలేజ్ ఫొటోల వంటివి గోడలపై వుంచి అతిధులతో ఆనందం పంచుకోండి.
మీ ఇల్లు మీకు స్వర్గం. ఎంతో పవిత్రమైంది. అది మీకు ఒక కానుకగా భావించండి. మీ పెద్ద అవసరాలను సైతం తేలికగా తీర్చే విధంగా ఇంటి అలంకరణ చేసి ఆనందించండి.



Click it and Unblock the Notifications