Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దీపావళికి ఇంటిలోపలి 3 ప్రధాన అలంకరణలు!

లివింగ్ రూమ్ - ఈ గది ఆకర్షణీయంగా వుండాలి. గోడలకు మంచి రంగు వేయండి. ఇతర అలంకరణ సామాగ్రి దీపాలు, రగ్గులు కూడా ఈ గదిలో పెట్టండి. వీటి రంగులు గోడల రంగులకు వ్యతిరేకంగా వుండాలి. ఒక టేబుల్ వేసి దానిపై ఒక గాజు పాత్రలో రంగురంగుల పూలు వేయండి. అందులోనే తేలియాడే కేండిల్స్ వుంచండి. కర్టెన్లు మార్చండి. మంచి లైట్ షేడ్ లో లైట్ పెట్టి గది కి ఒక మూలగా వేలాడదీయండి.
పూజ గది - పండుగ రోజంటే ఈ గదిని వచ్చిన అతిధులు తప్పక దర్శిస్తారు. దీని అలంకరణతోనే పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది. రంగురంగుల పూలు, దీపాలు, రంగుల బల్బులు, రంగు రంగుల ముగ్గులు, వీటన్నిటితో అలంకరణ పూర్తయినట్లే. ముగ్గులు వేసి వాటిపై పూల రేకులు వెదజల్లితే బాగుంటుంది. ముగ్గులో దీపాలు పెట్టండి. తలుపులు, కిటికీలు, పూజా టేబుల్ మొదలైనవి పూలతో నిండి వుండాలి.
టెర్రస్ లేదా వరండా - సాధారణంగా ఈ ప్రదేశంలో మనం క్రేకర్లు కాలుస్తాం. ఇక్కడ స్ధలం అధికం కనుక చాలా దీపాలు పెట్టవచ్చు. వరండా అంచులు ఎలక్ట్రిక్ లైట్లు తోరణాలు పెట్టండి. లేదా విభిన్నంగా వుండాలంటే, రంగు రంగుల కేండిల్స్ పెట్టండి. వాసన వచ్చే కేండిల్స్ అయితే చక్కటి సువాసన వస్తుంది. ఈ దీపాలు క్రేకర్స్ అంటించుకునేటందుకు సౌకర్యంగా కూడా వుంటాయి. వరండా ప్రవేశంలో ఆకర్షణీయమైన రంగుల ముగ్గు వేసి దీపాలు పెడితే అలంకరణ పూర్తయినట్లే. ఇంటికి వెలుగులు రావాలంటే ఈ అలంకరణ దీపావళికి చేయండి.



Click it and Unblock the Notifications