Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
సాంప్రదాయ డిజైన్లలో బెడ్ షీట్లు!

కాంతా పనితనం - ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో పేరొందిన ఎంబ్రాయిడరీ పనితనంతో కూడుకున్న డిజైన్లు. కాటన్ బెడ్ షీట్ చివర్లను ఎంబ్రాయిడరీతో కుట్లు వేస్తారు. రంగురంగుల పూలు, జంతువులు, పక్షులు మొదలైనవి ఈ పనితనంలో వుంటాయి.
గుజరాత్ ఎంబ్రాయిడరీ - గాఢమైన ఎరుపు, ఆకుపచ్చ, క్రీము, ఇండిగో, నీలం, పసుపు, పింక్ మొదలగు రంగుల్లో వుంటాయి. గుజరాత్ ఎంబ్రాయిడరీలో మంచి రొమాంటిక్ మూడ్ వుంటుందంటారు. ఒకే బెడ్ షీటులో వివిధ రంగుల గుడ్డ ముక్కలను జత చేస్తారు. వాటికి మరింత ఆకర్షణీయంగా అద్దాల ముక్కలను అమరుస్తారు.
ఫూల్ కారి డిజైన్ - ఈ పనితనం పంజాబు పనివారలది. కాటన్, లినెన్, సిల్కు బట్టలపై పూల డిజైన్లతో ఎంబ్రాయిడరీ చేస్తారు. వివిధ రంగులలో గీతలు కలిగి వుంటాయి. ఇవి పిల్లల బెడ్ రూమ్ లేదా అతిధుల బెడ్ రూమ్ లలో వేయడానికి బాగుంటాయి.
చికన్ డిజైన్ - ఇది సాధారణంగా మన ప్రాంతంలో అందరూ వాడే డిజైన్. కాటన్ గుడ్డపై చికన్ పని చేస్తారు. చాలాకాలం మన్నుతుంది. బెడ్ రూమ్ సాంప్రదాయకంగా వుంటుంది.
బ్లాక్ ప్రింట్ - చెక్కతో ప్రింట్లు వేస్తారు. బెడ్ షీట్లకు ప్రధానంగా దీనినే ఆచరిస్తారు. వివిధ రంగులు, డిజైన్లలో బెడ్ షీట్లు ఈ బ్లాక్ ప్రింట్ లలో ఆకర్షణీయంగా వుంటాయి.



Click it and Unblock the Notifications
