For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివింగ్ రూమ్-హాలుకు ఎలాంటి రంగులు వాడాలి!?

By B N Sharma
|

Home Decor
లివింగ్ రూమ్, హాలుకు లైట్ రంగులు ఏవైనా వాడవచ్చును. గృహాలంకరణలో ముఖ్యంగా అతిథులను ఆకట్టుకునే హాలుకు తెలుపు రంగు లేదా ఇతర లైట్ రంగులు వాడవచ్చు.ఇవి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి, అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. తలుపులు, కిటికీలు లేని గదికి ముదురు షేడ్లు వాడితే ఆకర్షణీయంగా ఉంటుందని ఇంటీరియర్ డెకరేటర్స్ సలహాలిస్తున్నారు.

అలాగే హాలు, లివింగ్ రూమ్‌లకు ముదురు, లేత రంగులు ఏవైనా సరే మంచి రంగులు ఎంపిక చేసుకోవడమనేది ముఖ్యం. అలా ఎన్నుకుంటేనే గదికి మీరు కోరుకున్న లుక్ వస్తుంది.లివింగ్ రూమ్ శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే గది కావడంతో రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త పడాలి. ఇంకా ఈ గదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదికి నీలం, గులాబి, ఆకుపచ్చ వంటి పోస్టల్ రంగులు లేదా న్యూట్రల్ షేడ్లు వాడటం మంచిది.

అలాగే రంగులకు తగినట్లు లైట్లను అమర్చుకుంటే లివింగ్ రూమ్, హాలు ప్రకాశవంతంగా ఉంటాయని ఇంటీరియర్ డెకరేటర్స్ సూచిస్తున్నారు. ఇంటి లోపలి భాగంలో వేసే రంగులు మంచి నాణ్యతగలవిగా వుంటే ఎంతో కాలం మన్నుతాయి. నేటి రోజులలో వచ్చే వాషబుల్ కలర్లను ఏవైనా మరకలయితే తుడిచేసుకోవడం కూడా తేలిక.

English summary

What sort of Colours can be used for a Living room | లివింగ్ రూమ్-హాలుకు ఎలాంటి రంగులు వాడాలి!?

To decorate your living room and hall you can use any light colour. This gives a cool look to that part of the house where you spend a lot of time daily.. Light colours to the living room give lot of relaxation mentally and also looks good even for the visitors coming to your house. Also you should arrange lighting suited to the colours you paint.
Story first published:Monday, September 19, 2011, 17:13 [IST]
Desktop Bottom Promotion