Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కిచెన్ గోడలకు ఎర్రరంగు వాడటంలో ప్రయోజనమేమిటి?

మీరు కనుక టైల్స్ కిచెన్ లో వేయిస్తున్నట్లయితే, దానిని ఎరుపు రంగు టైల్స్ గా వేయించండి. లేదంటే తెలుపు టైల్ తో కలిపి ఎరుపును ఉపయోగించండి. లేదంటే, షెల్ఫ్ భాగాలపై రెడ్ వేయవచ్చు. కిచెన్ గోడలు పూర్తిగా ఎరుపు వేయరాదనుకుంటే, వాల్ పేపర్లు ఉపయోగించండి. ఇవి ఎపుడు కావాలనుకుంటే అపుడు మార్చుకోవచ్చు. వ్యయం కూడా తక్కువే. చాలా సౌకర్యంవంతంగా వేసేయవచ్చు. లేదా, ప్రతి కిచెన్ లోను సాధారణంగా కేబినెట్ లు వుంటాయి. గోడలకు మరీ బ్రైట్ గా వుంటుందనుకుంటే రెడ్ కలర్ ను కిచెన్ కేబినెట్లకు వేయించండి. రెడ్ ను వైట్ తో కలిపి వేస్తే కూడా బాగుంటుంది. లేదా మీరు ఉపయోగించే క్రోకరీని రెడ్ కలర్ లో వుండేదిగా చూడండి. ఆ రంగు బోర్ కొట్టిందనుకుంటే క్రోకరీని మార్చవచ్చు.
అలాగే, కిచెన్ స్లాబ్ కు సాధారణంగా వాడే గ్రానైట్ కు బదులుగా ఎర్ర రాళ్ళు వాడవచ్చు. లేదంటే కిచెన్ లో వివిధ సరుకులు నిలువచేసుకొనేటందుకు ఉపయోగించే సీసాలు, జార్లు రెడ్ కలర్ వాడితే కూడా కంటికింపుగా వుంటుంది. కిచెన్ లో గనుక డైనింగ్ టేబిల్ వుంటే దానిని అక్కడ వాడే నేప్ కిన్స్ ను కూడా రెడ్ కలర్ లో వున్నవిగా వాడవచ్చు. ఈ రకంగా మీ ఎంపికను బట్టి వివిధ షేడ్లలో వివిధ కిచెన్ ప్రదేశాలలో రెడ్ కలర్ వాడవచ్చు. ఎరుపు వేసినందువలన మరో ప్రయోజనమేమంటే, కిచెన్ లో సాధారణంగా వచ్చే బొద్దింకలు ఎరుపు రంగుకు దూరంగా వుంటాయి. ఎరుపు కనపడితే చాలు అతి మక్కువగా మీరు చూసుకునే మీ కిచెన్ లోకి బొద్దింక దాడిచేయకుండా కూడా వుంటుంది.
కనుక పైన తెలిపిన వాటిలో అవకాశాన్నిబట్టి మీకిష్టమైన చోట ఎరుపు రంగు వాడి ప్రయోజనం పొందండి.



Click it and Unblock the Notifications