Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వాస్తు ప్రకారం ఇంటి లోపల ప్రధానం ఉంచకూడనివి..

ఫెంగ్‌షుయ్ ప్రకారం గృహాల్లో తీసుకోవాల్సిన కొన్ని వివరాల్లోకి వెళితే...ఫెంగ్‌షుయ్ ప్రకారం దాని ప్రభావం చూపటానికి ఇంటిలోని పనికిరాని కుప్పలకు సంబంధముంది. కుప్పలు ఉన్నట్లయితే ఫలితం కనిపించదు. కాబట్టి వాటిని తొలగించాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవచ్చు. మరికొన్ని వస్తువులను ఇంటిలోపల పెట్టుకోకూడదు. అనే విషయాలను తెలుపుతుంది. ఆ ప్రకారం ఇంటిలోపల అమర్చుకొన్నట్లైతే వాటి సుఖ, సంతోషాలు వెల్లు విరుస్తాయి. రకరకాల ఫోటోలను రకరకాల దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చునని ఫెంగ్ షుల్ తెలుపుతుంది. అయితే కొన్ని వస్తువును ఇట్లో పెట్టుకోకూడా అవేంటో తెలుసుకుందాం...
మహాభారతానికి సంబంధించిన చిత్రపటాలు: మహాభారతంనకు సంబంధించిన ఏ చిత్రపటాలను ఇంటిలోపల ఉంచుకోకూడదు. ఇలాంటి చిత్రాలను, మహాభారతానికి సంబంధించిన కొన్ని గుర్తులను ఇంటిలోపల పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ వైరం సూచిస్తుంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటివి ఏవీ పెట్టుకోకపోవడమే మంచిది.
తాజ్ మహాల్: చాలా మందికి తెలుసు తాజ్ మహాల్ ను ముంతాజ్ కోసం షాజహాన్ ప్రేమకు గుర్తుగా కట్టించాడని. 17వ శతాబ్దంలో షాజాహాన్ తన భార్య పై ఉన్న ప్రేమకు గుర్తుగా తాజ్ మహాల్ ను నిర్మించాడు. తాజ్ మహల్.. ఈ పేరు వింటే ప్రేమికుల మనసులో ఓ పులకింత.. ఓ అనుభూతి.. తాజ్ మహల్ చెంతన చేతిలో చేయేసుకొని ఫోజులిచ్చి ఫోటో దిగాలని ఎందరో ప్రేమికులు కోరుకుంటారు. కానీ అది ఏ కొందరికో సాధ్యమవుతుంది. నిష్కల్మషమైన ప్రేమకు స్వచ్ఛమైన పాలలాంటి గుర్తు ఈ పాలరాతి కట్టడం.. అంతేకాదు బహుభార్యత్వం ఉన్న రాచరికంలో కూడా భార్యను అంతగా ప్రేమించి తుదిశ్వాస వరకు ఆ ప్రేమచిహ్నపు గోపురాన్నే చూస్తూ గడిపిన ఉద్విగ్న సన్నివేశాలు షాజహాన్ కే సొంతం. అటు వంటి తాజ్ మహాల్ వెనుక ఓ విషాద గాధ ఉంది కాబట్టి తాజ్ మహాల్ లో ఉన్న సమాధి గుర్తులున్న ఫోటోలను ఇల్లల్లో ఉంచకోకూడదంటున్నారు వాస్తు నిపుణులు.
సింకింగ్ బోట్(పడిపోబోతున్న లేదా నాశనమవుతున్న బోట్): ఇంట్లో ఉంచకూడని వస్తువుల్లో ఇది కూడా ఒక ప్రధానమైన వస్తువు. లేదా చిత్రం. మునుగుతున్నట్టు ఉన్న పడవ చిత్రపటం లేదా బొమ్మలు ఇంట్లో ఉంచుకొన్నట్లైతే ఆ పడవ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో దిగజార్చే స్వభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి చిత్రపటాలు ఏవైనా ఉన్నట్లైతే వాటిని వెంటనే తొలగించడం మంచిది.
వాటర్ ఫౌంటైన్(నీటి ధార): ఇంటి అలంకరణ కోసం కొంతమంది ఇల్లల్లో వాటర్ ఫౌంటైన్ ను ఉంచుకొంటారు. అయితే ఇది చూడటానికి అందంగా ఉన్నా దీని వల్ల కొంచెం నష్ట కూడా జరుగుతుంది. చాలా మంది నీటిని ఎంత వృదా చేస్తే అంత డబ్బు ఖర్చు అవుతుంది నమ్ముతుంటారు. మరి వాటర్ ఫౌంటైన్లో నీరు ఎప్పుడూ దారలాగ ప్రవహించడం వల్ల డబ్బుకూడా అలా వేస్ట్ అయిపోతుంది. డబ్బునిలవదని దీన్ని ఇంట్లో ఉంచుకోకూడదంటున్నారు.
వైల్డ్ అనిమల్స్: అడవి జంతువుల యొక్క చిత్రం, చిత్రపటాలు ఇల్లలో పెట్టుకోకూడదు. అలాంటి చిత్ర పటాలు ఉంచుకోవడం వల్ల ప్రకృతిలో ఒక హింసాత్మక విధానం తెస్తుంది.
అలాగే ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి. చిరిగిపోయిన, వెలసిపోయిన పోటోలను తొలగించాలి. పాత పుస్తకాలు ఇంటిలో వేలాడతీయకూడదు. పగిలిన వస్తువులు, కొంతబాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచండి.



Click it and Unblock the Notifications