Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పాత బెడ్ షీట్లతో ఇంటి అలంకరణ...!
ముఖ్యంగా మన ఇల్లల్లో బెడ్ రూమ్ అలంకరణ సాంప్రదాయ పద్ధతిలో చేస్తాం. బెడ్స్ పై వేసేటటువంటి బెడ్ షీట్లు ఎంతో ఆకర్షణీయంగాను మన అభిరుచులకు తగినట్లుగాను వుండేవిగా చూస్తాం. ఇందుకు గాను కొన్ని అందమైన సాంప్రదాయక డిజైన్లు, వివిధ ప్రదేశాల కళాత్మక మైనవి ఎక్కువగా ఎంపిక చేసుకుంటాం. అవి బాగా అందంగా, గట్టిగా ఉన్నన్ని రోజూలు వాటిని విడకుండా వాడుకుంటాము. అయితే కొద్ది రోజులకు లేదా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ బెడ్ షీట్లు కలర్ తగ్గిపోవడం, లేదా పాతబడినట్లు అయిపోవడంతో వాటి పక్కన పడేస్తుంటాం. అలా చేయకుండా జీవితంలో కొత్త మార్పు కోసం వాడేసిన లేదా పక్కన పెట్టేసిన బెడ్ షీట్లను మనం తిరిగి వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వాటితో అందంగా ఇంట్లో వస్తువులను అలంకరించుకోవచ్చు. మీరు తరచూ ఇంటి అలంకరణ చేసే అలవాటు ఉంటే కనుక మరి పాత బెడ్ షీట్లను, కాటన్, సాటిన్ లేదా సిల్క్ బెడ్ షీట్స్ వంటవి విభిన్న అలంకరణలకు ఉపయోగించవచ్చు. మరి అవి ఎలాగో ఒకసారి చూద్దాం...

విండో కర్టెన్: అందమైన పూలతో డిజైన్ చేయబడిన కాటన్ బెడ్ షీట్లను సులభంగా విండో కర్టెన్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇవి చూడాటానికి అందంగాను ఉంటాయి. ఈ బెడ్ షీట్లు పలుచగా ఉన్నటువంటివి వేసవికాలంలోనూ, మందంగా ఉన్నటువంటివి శీతాకాలం, చలికాలంలోనూ విండోలకు ఉపయోగిచవచ్చు. విండో సైజును బట్టి బెడ్ షీట్ ను మడిచి కరెక్ట్ గా సరిపోయేంత కట్ చేసుకొని కర్టెన్ లా కుట్టించి విండోకి అలంకరణ చేయవచ్చు. అదే డిజైన్ లో కొత్తలుక్ తో కనబడే కర్టెన్ ను బయట మార్కెట్ లో కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలా పాతవైనా బాగా ఉన్నవాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు.
ఐరన్ బోర్డ్ కవర్: మీ ఇంట్లో ఐరన్ టేబుల్ ఉంటే కనుక దాని మీద ఈ పాత బెడ్ షీట్ కరెక్ట్ గా మడిచి లేదా కరెక్ట్ సైజ్ లో కట్ చేసుకొని ఐరన్ టేబుల్ పైన అలంకరణ చేసుకోవచ్చు. పాత కాటన్ బెడ్ షీట్ తీసుకొని లోపల వైకు మడి పిన్ చేసుకోవచ్చు. ఐరన్ బోర్డ్ కి బ్రైట్ కలర్ బెడ్ షీట్ ను ఉపయోగిస్తే మరింత అందంగా కనిపిస్తాయి.
కుషన్ కవర్: పాత చీరలకు లేదా డ్రెస్ లకు ఉన్నటు వంటి పట్టును పారేయకుండా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ముందుగా కుషన్ కొలతలు తీసుకొని, మంచి కలర్స్ ఉన్న పాత బెడ్ షీట్స్ ను, తర్వాత నిరుపయోగంగా ఉన్న పట్టును టైలర్ దగ్గరకు తీసుకెళ్లి కుషన్ కవర్ ను రెడీ చేసి ఇమ్మనాలి. మీకు కావల్సిన డిజైన్ లో పట్టును బార్డర్ గా కుట్టించి, ఎంబ్రైడరీన చేయించి తీసుకొచ్చి కుషన్లకు తొడిగి చూడండి. ఆ కొత్త అందానికి ఆశ్చర్యం వేయక తప్పదు.
టేబుల్ కవర్: బెడ్ షీట్ తో సెంటర్ టేబుల్ లేదా స్టడీ టేబుల్ మీద పరడం కూడా ఒక మంచి డెకరేటింగ్ ఐడియానే. పాత కాటన్ బెడ్ షీట్ తీసుకొని టేబుల్ సైజు కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని చివరలను, అంచులను కుట్టించి సెంటర్ టేబుల్, స్టడీ టేబుల్ మీద వేసి చూడండి ఆ గదిలో మరింత అందం చేకూరుతుంది.
లాండ్రీ బ్యాగ్: ఇంట్లో స్థలాన్ని బట్టి పాత బెడ్ షీట్ తో లాండ్రీ బ్యాగ్ ను కుంటించి అందులో మాసిన బట్టలు, ఉతకాల్సిన దుస్తులను వేసి పెట్టుకోవచ్చు. ఇలా పాత బడినవి పడేయడానికి లేదా ఇతరులకు ఇయ్యడానికి ఇష్టం లేని వాళ్లు ఇలా చేసి చూడండి. కొత్త అందాన్ని ఆహ్వాదించండి.



Click it and Unblock the Notifications