For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి ఆవరణంలో ఆహ్లాదానిచ్చే కృత్రిమ జలపాతం..

|

Artificial Water Fountains for attractive Homes
ఇంతకు ముందు ఆరుభయట పార్కుల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొనే విధంగా ఆధునికి ఆటపరికరాలతో పాటు వాటర్ పౌంటేన్ లను ఏర్పాటు చేసుకునేవారు. ఇళ్లలో ఇప్పుడు కృత్రిమ జలపాత(వాటర్ ఫౌంటెయిన్)లను పెట్టుకోవటం ఫ్యాషన్‌ గా మారిపోయింది. టేబుల్ టాప్ మరియు ఇన్ డోర్..అవుట్ డోర్ వాటర్ ఫౌంటైయిన్స్ అమర్చుకోవడంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపినట్టు ఉంటుంది. వాటర్ పౌంటేయిన్ నుండి జలజల రాలే నీటి దారల శబ్దాలతో మీలో ఉన్న చింతలన్నీ మైమరచి పోవాల్సిందే..ఇంట్లోనే ఏదైనా చిన్న గార్డెన్, పాషియో, ఇల్లు లేదా ఆఫీస్ ఇలా అన్నింటికి పరిపోయే విధంగా మార్కెట్లో బాగా దొరికే ఈ కృత్రిమ జలపాతాలు ఇంట్లో ఎలా అమర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. అతిథులకు చల్లగా స్వాగతం పలికేందుకు గెస్ట్ రూంలలో దృశ్య ప్రధాన కృత్రిమ జలపాతాలను పెడితే చాలా బాగుంటాయి. గదిలో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే కృత్రిమ జలపాతాలు అతిథులను చక్కగా ఆకట్టుకుంటాయి.
2. కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేలా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా నేడు విగ్రహాల రూపంలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువగా దృశ్యప్రధానంగా ఉంటేనే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.
3. లివింగ్ రూం పరిమాణాన్ని బట్టి కొంతమంది కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి వాటికి పువ్వులు, మొక్కలు ఉన్నవైతే బాగుంటాయి. పడక గదిలో అయితే ఉత్సాహం, మానసిక ప్రశాంతతను కలిగించేలా సూర్యోదయం, చంద్రోదయం లాంటి దృశ్యప్రధాన కృత్రిమ జలపాతాలు బాగా నప్పుతాయి.
4. విశాలమైన బాల్కనీ ఉండేవారికి కృత్రిమ ఫైబర్ జలపాతం బాగా నప్పుతుంది. అలాగే బాల్కనీ చిన్నదిగా ఉండేవారికి వాల్ ఫౌంటెయిన్ సరిపోతుంది. ఇవి ఏ గదులకైనా అనువుగానే ఉంటాయి. బాల్కనీల సైజును బట్టి కనీసం నాలుగు అడుగుల ఫౌంటెయిన్‌ ను అమర్చుకోవచ్చు.
5. ఇక పిల్లలు చదువుకునే గదిలో టేబుల్‌ టాప్ లైటింగ్, షేకింగ్ లైటింగ్ టేబుల్‌ టాప్ రకాలలో లభ్యమయ్యే కృత్రిమ జలపాతాలు సరిపోతాయి. వీటిలో ప్రకృతిని ప్రతిబింబించేలా ఉండేవి కూడా లభిస్తాయి. చదువుమీద ధ్యాస పెట్టేందుకు, పిల్లల మనస్సు నిర్మలంగా ఉండేందుకు ఇవి బాగా సహకరిస్తాయి.

English summary

Artificial Water Fountains for attractive Homes | ఇంటి ఆవరణంలో ఆహ్లాదానిచ్చే కృత్రిమ జలపాతం..

Tabletop and Mini indoor-outdoor water fountains create a relaxing environment with a water trickle sound that washes your worries away! Perfect for any small garden, patio, home or office.
Story first published:Friday, January 20, 2012, 16:49 [IST]
Desktop Bottom Promotion