Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వెదురు ఫర్నీచర్ తో ఇంటి ఆకర్షణ రెటింపు...

ఇదివరకు వెదురును కేవలం హస్తకళా రూపాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఇంటీరియర్ డెకరేషన్ కోసం వెదురు విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. చాలాచోట్ల కలప, ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్న వెదురుతో చాపలు, రకరకాల బుట్టలు, ట్రేలు అల్లడమే మనకు తెలుసు.
అయితే... విశాలమైన గదుల్లో పార్టిషన్ లాగా కూడా అందంగా రూపొందించిన వెదురు తడికెలను ఉపయోగించవచ్చు. వెదురు ప్యానెల్స్‌ని పైకప్పుతో మొదలెట్టి గోడలమీద వాడవచ్చు. తలుపులు, ఫర్నీచరు, అల్మారాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా కలప బదులుగా ఫ్లోరింగ్‌కు కూడా వెదురును వాడుతున్నారు. కిటికీలకు వెదురు బ్లెండ్స్ వేయించుకుంటే వెరైటీగా ఉంటుంది.
మహిళల అభిరుచులకు అనుగుణంగా వెదురు వస్తువులను తయారు చేస్తున్నారు. పూజా సామగ్రి తీసుకువెళ్లే బుట్టలతో పాటు వెదురు స్టూళ్లు, కుర్చీలు, టేబుళ్లు, సోఫా సెట్లకు నేడు మంచి డిమాండ్ ఉంది. వెదురు చౌక మాత్రమే కాదు. వస్తువుల మెయింటనెన్స్ చాలా తేలికే. తరచుగా తడి వస్త్రంతో తుడుచుకుంటే సరిపోతుంది. ఆరునెలలకొకసారి వార్నిష్ వేయిస్తే కొత్తగా మెరుస్తూ ఉంటాయి. పాడయిపోయిన వస్తువును మరో కొత్త వస్తువుగా మార్చుకోవచ్చు కూడా.
వెదురు ఫర్నీచర్ లామినేషన్ చేసి ఉంటుంది కాబట్టి త్వరగా గీతలు పడడం, పాడవడం జరగదు. వాడగా వాడగా కుర్చీల వంటివి కాళ్ల దగ్గర చీలీ పోయి పాడవుతాయి. అందువల్ల చీలిన చోట ప్లాస్టిక్ గట్టిగా బిగిస్తే చూడడానికి నీట్‌గా ఉంటాయి. చాలాకాలం మన్నుతాయి. అంతేకాదు పర్యావరణానికి హాని చేయకుండా ఇంటి అలంకరణ పూర్తిచేయవచ్చు.



Click it and Unblock the Notifications