For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానాల గది సౌందర్యం చూడతరమా....

|

Bathroom Decorating Accessories
చాలా మంది వ్యక్తిత్వ వికాసం ద్వారా మనుషులను విశాలం చేసుకుంటాం, ఇంటీరీయర్ కు ప్రాధాన్యతమిచ్చి ఇంటిని అందంగా, విశాలంగా ఉండేలా చూసుకుంటాం. అయితే బాత్ రూం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇంటి అలంకరణలో శ్రద్ధ చూపించేవారిలో చాలామంది బాత్రూంలను పెద్దగా పట్టించుకోరు. దాంతో ఇల్లు ఎంత అందంగా మెరిసిపోతున్నా, బాత్రూంలన్నీ పాతవాటిలా అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి.

1. అందుకే తీరిక దొరికినప్పుడల్లా బాత్రూంలలో కూడా చిన్న చిన్న అలంకరణలు చేయాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాత్రూంలను శుభ్రంగా కడగటం మరచిపోవద్దు.

2. మధ్యమధ్యలో స్నానాల గదికి మంచి లేత రంగుల్లో ఉండే పెయింట్ వేయించుకోవాలి. లేదంటే... బాత్రూం చీకటిగా, డల్‌ గా అనిపిస్తుంది.

3. ఆర్ట్ పెయింటింగ్ తీగలు ప్లవర్స్ ఉండేటట్లు చూసుకోవడమే కాకుండా, స్నానాల గదిలో ముదురు రంగులను ఎంచుకోవాలి. లేత రంగులను వేయించడం వల్ల కూడా గది విశాలంగా కనిపిస్తుంది.

4. బాత్రూంలకు కూడా అందమైన కర్టెన్లు వేయాలనుకున్నట్లయితే.. ఆహ్లాదకరమైన సీనరీలు ఉండేవాటిని ఎంచుకోవటం మంచిది.

5. బాత్ రూం విండో దగ్గర పాట్ ప్లాట్ పెట్టుకోవాలి. అలాగే బాత్ రూంలో క్యాండిల్ అరేంజ్ చేసుకొంటే ప్రశాతమైనటువంటి వాతవరణం ఏర్పడుతుంది.

6. బాత్ రూం లో ఉపయోగించే వస్తువులు కూడా ఆకర్షించేలా ఉండాలి. కర్టెన్లు, బాత్ రగ్స్, టిష్యూ హోల్ డర్స్, డెకరేటివ్ సోప్ డిస్పాన్సర్స్, ఆర్ట్ వర్క్, ఫ్లవర్ వాస్, మొదలైనన్నింటిలోనూ జాగ్రత్తలు పాటించాలి.

7. తీసేసే బట్టలు, ఉతకాల్సిన బట్టలు వేసుకోవడానికి డెకరేటివ్ గా ఉండే బ్యాస్ కట్, లేదా కంటైనర్ ఉండేలా చూసుకోవాలి.

8. ముఖ్యంగా బాత్ రూంకి గ్లాస్ సెల్వ్ ఉంటేనే మంచిది. క్లీన్ చేయడానికి అందంగా కనించడానికి బాగుంటాయి.

English summary

Bathroom Decorating Accessories...and Ideas... | స్నానాల గది సౌందర్యం చూడతరమా....

Bathroom is one of the most frequently used areas in your house. Thus, you can apply some interesting bathroom decorating ideas to turn your bath into a welcoming retreat where you can relax and forget your troubles for a while.
 To begin with, you need to choose attractive paint colors for walls. Moreover, you can choose different tile designs for walls, flooring, backsplash and counter top. Plus, decoration ideas for bathrooms focus on fantastic selection of bathroom furniture and accessories.
Story first published:Thursday, April 5, 2012, 17:27 [IST]
Desktop Bottom Promotion