Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి సౌందర్యాన్ని పెంపొందించుటలో కర్టెన్ల ప్రాధాన్యత.....

1. కిటికీలను ఖాళీగా వదిలేయకుండా కర్టెన్లు వేసి చూడండి. మీ ఇల్లు ఎంతో హుందాగా కనిపిస్తుంది. అలా అని కిటికీలకు రెండు వైపులా రెండు మేకులు కొట్టి కర్టెన్ వేలాడదీస్తే సరిపోతుందని భావించకూడదు. మార్కెట్లో రకరకాల రంగుల్లో కర్టెన్లు లభిస్తున్నాయి. వీటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓ రెండొందల రూపాయలు పెడితే చాలు ఓ కిటికీకి సరిపడా కర్టెన్‌ను కొనుగోలు చేయొచ్చు. పైగా సాదాసీదా కాకుండా నాణ్యమైన తెరల్ని ఎంచుకోవచ్చు.
2. కర్టెన్లను వేలాడదీయడానికి తోడ్పడే సరికొత్త రాడ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొంచెం సమయాన్ని వెచ్చించగలిగితే ఇందులోనూ బోలెడన్ని వెరైటీలు దొరుకుతాయి. యాక్సెసరీల సంఖ్య తక్కువేం కాదు. కర్టెన్లకు సరిపోయే రంగుల్లో కూడా ఈ రాడ్స్ దొరుకుతున్నాయి.
3. సరిగ్గా కిటికీ ఎంత మేరకు ఉందో అంత వరకే కర్టెన్ వేలాడదీస్తే ఇల్లు ఇరుకుగా కనిపిస్తుంది. అదే కాస్త కిందిదాకా వేలాడదీశారనుకోండి చిన్న గది సైతం విశాలంగా అనిపిస్తుంది. పైగా దీనికయ్యే ఖర్చూ పెద్దగా ఉండదు.
4. ఎండ ఎక్కువగా గదిలోకి పడుతున్నట్లయితే కిటికీలపై కాస్త మందంగా ఉండే కర్టెన్లను ఎంచుకోవడం మేలు. ఇవైతేనే వెలుతురును అడ్డుకుంటాయి. భిన్నంగా కనపడాలంటే మాత్రం వివిధ రంగుల్లో క్లాత్‌తో కర్టెన్లను కుట్టించుకోవాల్సిందే.
5. ఉట్టిపడాలంటే రింగులకు వేలాడదీసే డ్రేపరీస్ ను ఎంచుకోవచ్చు. సాధారణ కర్టెన్లు అయితే ముందు, వెనుక రెండు వైపుల ఒకే ఫ్యాబ్రిక్ ఉంటుంది. సంప్రదాయబద్ధంగా ఉండే డ్రేపరీస్ లో చూస్తే ముందువైపు అలంకరించిన కర్టెన్ తో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇంతేనా అనుకోవద్దు. దీనిలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. వెలుతురును అడ్డుకోవడమే కాదు. కావాలంటే ప్రసరించేలా చేస్తుంది. అంటే ఒకటే రెండు రకాలుగా పనిచేస్తుందన్నమాట.
6. లివింగ్ రూమ్‌కు అయితే వెల్ వెట్, సిల్క్ బాగుంటుంది. పడకగది, స్టడీ రూమ్ లోకి లైన్డ్, కాటన్ ఫ్యాబ్రిక్ నప్పుతుంది. పిల్లల గదుల్లో అయితే కార్టూన్ కర్టెన్లును వేలాడదీయవచ్చు.



Click it and Unblock the Notifications