For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి సౌందర్యాన్ని పెంపొందించుటలో కర్టెన్ల ప్రాధాన్యత.....

|

Best Curtains to be the main attraction for home
ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకోవాలను కుంటారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇంటి అందాన్ని ద్విగుణీ కృతం చేసే విషయంలో డోర్‌ కర్టెన్లది ప్రధాన ఆకర్షణ. ప్రధానంగా కర్టెన్లకు వాడే వస్త్రాలనుంచి సోఫాలకు వాడే వస్త్రాల వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలంటే కిటికీలు సరిగ్గా ఉండాలి కదా! అలా ఉండి, చక్కని గాలి వెలుతురు వస్తేనే మనం కూడా ఉల్లాసంగా... ఉత్సాహంగా ఉండటం సాధ్యవువుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్నా వీటిని పెద్దగా పట్టించుకోం. ఫలితంగా ఇవి బోసిపోతుంటాయి. కాస్త శ్రద్ధ వహిస్తే... ఇంటికే కొత్త కాంతుల్ని తీసుకురావచ్చు

1. కిటికీలను ఖాళీగా వదిలేయకుండా కర్టెన్లు వేసి చూడండి. మీ ఇల్లు ఎంతో హుందాగా కనిపిస్తుంది. అలా అని కిటికీలకు రెండు వైపులా రెండు మేకులు కొట్టి కర్టెన్ వేలాడదీస్తే సరిపోతుందని భావించకూడదు. మార్కెట్లో రకరకాల రంగుల్లో కర్టెన్లు లభిస్తున్నాయి. వీటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓ రెండొందల రూపాయలు పెడితే చాలు ఓ కిటికీకి సరిపడా కర్టెన్‌ను కొనుగోలు చేయొచ్చు. పైగా సాదాసీదా కాకుండా నాణ్యమైన తెరల్ని ఎంచుకోవచ్చు.

2. కర్టెన్లను వేలాడదీయడానికి తోడ్పడే సరికొత్త రాడ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొంచెం సమయాన్ని వెచ్చించగలిగితే ఇందులోనూ బోలెడన్ని వెరైటీలు దొరుకుతాయి. యాక్సెసరీల సంఖ్య తక్కువేం కాదు. కర్టెన్లకు సరిపోయే రంగుల్లో కూడా ఈ రాడ్స్ దొరుకుతున్నాయి.

3. సరిగ్గా కిటికీ ఎంత మేరకు ఉందో అంత వరకే కర్టెన్ వేలాడదీస్తే ఇల్లు ఇరుకుగా కనిపిస్తుంది. అదే కాస్త కిందిదాకా వేలాడదీశారనుకోండి చిన్న గది సైతం విశాలంగా అనిపిస్తుంది. పైగా దీనికయ్యే ఖర్చూ పెద్దగా ఉండదు.

4. ఎండ ఎక్కువగా గదిలోకి పడుతున్నట్లయితే కిటికీలపై కాస్త మందంగా ఉండే కర్టెన్లను ఎంచుకోవడం మేలు. ఇవైతేనే వెలుతురును అడ్డుకుంటాయి. భిన్నంగా కనపడాలంటే మాత్రం వివిధ రంగుల్లో క్లాత్‌తో కర్టెన్లను కుట్టించుకోవాల్సిందే.

5. ఉట్టిపడాలంటే రింగులకు వేలాడదీసే డ్రేపరీస్‌ ను ఎంచుకోవచ్చు. సాధారణ కర్టెన్లు అయితే ముందు, వెనుక రెండు వైపుల ఒకే ఫ్యాబ్రిక్ ఉంటుంది. సంప్రదాయబద్ధంగా ఉండే డ్రేపరీస్‌ లో చూస్తే ముందువైపు అలంకరించిన కర్టెన్‌ తో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇంతేనా అనుకోవద్దు. దీనిలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. వెలుతురును అడ్డుకోవడమే కాదు. కావాలంటే ప్రసరించేలా చేస్తుంది. అంటే ఒకటే రెండు రకాలుగా పనిచేస్తుందన్నమాట.

6. లివింగ్ రూమ్‌కు అయితే వెల్‌ వెట్, సిల్క్ బాగుంటుంది. పడకగది, స్టడీ రూమ్‌ లోకి లైన్డ్, కాటన్ ఫ్యాబ్రిక్ నప్పుతుంది. పిల్లల గదుల్లో అయితే కార్టూన్ కర్టెన్లును వేలాడదీయవచ్చు.

English summary

Best Curtains to be the main attraction for home | ఇంటికి కొత్త కాంతుల్ని తెచ్చే కర్టెన్లు......

A Curtain is a piece of cloth intended TO BLOCK or light, or water in the case of a shower curtain. curtains hung over a doorway is not just cloth only, a curtain creates a unique look of your house.
Story first published:Monday, January 23, 2012, 13:49 [IST]
Desktop Bottom Promotion