Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఈ ఫర్నీచర్ లోనే ఉంది అసలు సుఖం...

1. కేన్ ఫర్నీచర్ మొదట్లో కొన్నప్పుడు కళకళామెరిసిపోతుంటుంది. తర్వాతతర్వాత కొద్దిగా వెలిసినట్టుగా మారిపోతుంది. దానికోసం పాలీస్ చేయించాల్సిన అవసంర లేదు. కొద్దిగా నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలపి మెత్తని వస్త్రంతో తుడిస్తే చాలు. తిరిగి యాథాస్థితికి వచ్చేసి తళతళలాడుతూ కొత్తవాటిలా మారిపోతాయి.
2. ఇంట్లో మనం ఉపయోగించే ఏదేని ఫర్నీచర్ ను శుభ్రంచేశాక ఫర్నీచర్ ను పూర్తిగా ఆరనివ్వాలి. ఆరక ముందే కుషన్లు, పరుపులు వేసెయ్యకూడదు.
3. గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ కలిపి మెత్తని వస్త్రంతో శుభ్రంచేసినా చాలు అవి మెరిసిపోతాయి.
4. ఇంట్లో బాగా వేడి తగిలేచోట కేన్ ఫర్నిచర్ ను పెట్టకూడదు. వుడ్ చీలిపోయే ప్రమాదం ఉంది. కేన్ ఫర్నిచర్ వుంచడానికి అనువైన స్థలం ఇంటి లోపలే నీడపట్టున వుంటేనే వాటిలోని అందం ఇనుమడిస్తుంది. అవుట్ డోర్ లో వేయాలనుకొన్నప్పుడు నీడ పడే ప్రదేశంలో వేసుకోవాలి.
5. కేన్ ఫర్నిచర్ ను మొదట్లో చాలా బాగా ఉపయోగిస్తారు అయితే పోనుపోనూ.. కట్లు, మేకులు వదులవడం, కర్రలు విరిగిపోవడం. ఇవన్నీ చాలాకాలం వాడిన తర్వాత వచ్చే ఇబ్బందులు. అలాంటపుడు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే చాలు. వీటన్నింటికీ ఒకసారి ఫర్నిచర్ తయారుచేసేవారిని పిలిపించి సరిచేసుకోవడం ఉత్తమం. అప్పుడే వాటికి కాస్త పాలీష్ పెట్టించేశామా... ఇక తిరిగి చూడాల్సిన పనుండదు. కేన్ ఫర్నీచర్ అందమైనదే కాదు వెల తక్కువ కూడానూ..మరి ఇలాంటి ఫర్నీచర్ మన ఇట్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో....



Click it and Unblock the Notifications
