Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మనస్సును... మన హావ భావలను ప్రభావితం చేసే రంగులు...!

ప్రతి ఇంటికి రంగులు వేద్దామని ఆలోచన వచ్చినపుడు ఏదో హడావిడిగా రంగులు వేయించడం కాకుండా ఏ రంగులయితే మనసుకు ప్రశాంతతను, ఇంటికి అందాన్ని ఇస్తాయో తెలుసుకుని ఆవిధంగా వేయించుకుంటే మంచిది. ఎందుకంటే రంగుల ప్రభావం మన మనసుపై ఎక్కువగా పడే అవకాశాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లో ఏ గదులకి ఎలాంటి రంగులను వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో, అవి మనం మూడ్ మార్పుకు ఎలా దోహదం చేస్తాయో తెలుసుకుందామా..!
రంగులో ఎన్నైనా ఇతర వాటికంటే కాస్త ఎక్కుగా కనిపించే రంగు ఎరుపు, పసుపు పచ్చ, నారింజ, గోధుమ, పాలిపోయినట్లు కనిపించే ఇసుక రంగులు విశ్రాంతికి గదులకు బాగుంటాయి. ఈ రంగులు వేస్తే కుటుంబ సంబంధాలు బలపడటమే కాక ఇతరుల పట్ల అభిమానం, సంబంధాలను ఏర్పరుచుకోగలుగుతారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బెడ్ రూమ్. విశ్రాంతి తీసుకుని జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడానికి అవసరమైనది పడకగది. నీలం, ఆకుపచ్చ, లావెండర్ రంగులు పడకగదిలో ప్రశాంత వాతావరణానికి దోహదపడతాయి.
ఈ రంగులు ముదురుగా ఉంటే వాటిప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు రక్తపోటును, గుండె వేగాన్ని పెంచుతుంది. కార్యకలాపాలను వేగిరపరుస్తుంది. నీలం దీనికి పూర్తి భిన్నమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. వంట గది విషయానికొస్తే ఎరుపు, పసుపు రంగులు బాగుంటాయి. ఎరుపు రంగు డైనింగ్ హాలులో ఉన్నట్లయితే మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినడం జరుగుతుంది. సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేటట్లు ఈ రంగు ప్రభావం చూపుతుంది. అతిథులతో సంభాషణలకు, ఆకలిని పెంచడానికి ఎరుపు రంగు దోహదం చేస్తుంది. అయితే డైటింగ్ చేయాలనుకున్నట్లయితే భోజనం చేసే గదిలో ఎరుపు రంగు లేకుండా చూసుకోవడం మంచిది.
స్నానాల గదికి ఎలాంటి రంగు వేయాలి అని చూస్తే తెల్లగా, తీక్షణంగా ఉండే రంగులు వేస్తే మంచిది. అవి పరిశుభ్రతకు, స్వచ్ఛతకు సూచికలుగా నిలుస్తాయి. తక్కువ ఖర్చు కూడా అవుతుంది. తొందరగా పాడయినా ఆ రూమ్ వరకు తిరిగి వేసుకొనే అవకాశం ఉంటుంది. పెద్దపెద్ద భవనాల్లో అయితే నీలం, ఆకుపచ్చ, వైఢూర్యం రంగులు బాగుంటాయి. ఇవి ఏకాంతంగా గడపడానికి ఎంతో సహాయం చేస్తాయి. ఆఫీసు పని ఒత్తిడితో అలసిపోయే మనసుకు ఊరటనిచ్చేది ఇల్లే కాబట్టి ప్రశాంతంగా ఉండేలా రంగులు ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications