For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగది అలంకరించుకోవడానికి ఇదే సరైన సమయం...!

|
Decor Ideas For Summer Kitchen...!
ఒక సారి ఇంటి రూపాన్ని మార్చి చూస్తే....ఎలాఉంటుంది?అలాగే వంటగది?ఈ వేసవికి మీ వంటగదిని ప్రకాశవంతమైన రంగులు.. ఇతర ఉపకరణాలతో అలంకరించు చూడండి. మార్పుతో పాటు కొత్తదనం సంతరించుకొంటుంది. కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు చెందుతుంటాయి. అలాంటప్పుడు ఆ వాతావరణానికి తగినట్లు ఇంట్లో కూడా మార్పు చేసినట్లైతే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ వేసవిలో మీ వంటగదిలో మార్పుల కోసం కొన్ని చిట్కాలు...వేసవిలో వంటగది అలంకరణ కోసం తక్కువ ఖర్చుతో కూడిన నటువంటి చిట్కాలు మీకోసం:

వంటిగది గోడల మీద శ్రద్ద పెట్టడం: మీ వంటగది కొత్తగా కనిపించడానికి, వంటగది గోడలకు రంగు మార్చి వేరే పెయింట్ వేయించి చూడండి. మార్పు మీకే అర్థం అవుతుంది. ముఖ్యంగా వేసవిలో వంటగది గోడలకు పసుపు, ఆరెంజ్ మరియు ఎరుపు వంటి ముదురు రంగుల పేయింట్ వేసుకోవడం వల్ల ఆ గదికి ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది.

ముదురు రంగులు, ప్రకాశవంతమైన రంగులు: వేసవిలో మార్పు కోసం వంటగది గోడలకే కాదు...వంటగదిలో ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు కూడా ప్రకాశవంతమైనవిగా అమర్చుకొని ప్రయత్నించి చూడండి. వంట పుస్తకాలు, డైనింగ్ టేబుల్ కవర్స్, వంట చేసేటప్పుడు వినియోగించే టవల్స్, కర్టెన్స్, చేతి రుమాళ్ళు...ఇలాంటి వాటి ఎంపికలో కూడా మార్పు చేసి చూడాలి....

వంటగది ఉపకరణాలు: వేసవిలో వంటగదిలో వినియోగించే ఉపకరణాలను పూలు, పూసలు, మరియు సేన్టేడ్ కొవ్వొత్తులను వంటివి కూడా కలర్ ఫుల్ గా ఉండే విధంగా చూసుకోవాలి. వంటగదిలో గోడకు తగిలించే అలంకరణ వస్తువులు కూడా మరింత అందాన్నిస్తాయి...

మొక్కలు: వేసవిలో ఇంట్లో మార్పులతో పాటు చిన్న చిన్న మొక్కలను. చక్కటి ఆకృతి కలిగిన బోన్సాయ్ మొక్కలను ఇంట్లో అక్కడక్కడ పెట్టుకొన్నట్లైతే ఇంట్లో పచ్చదనంతో పాటు సహజ ప్రకృతి కలిగిన వాతావరణాన్ని తలపిస్తుంది. బోన్సాయ్ మొక్కలతో పాటు రంగురంగుల పూల మొక్కల కుండీలను వంటగది విండో దగ్గ అమర్చుకోవచ్చు.

పళ్ళ బుట్ట: వేసవి కాలంలో రంగురంగుల, రుచికరమైన పండ్లు విరివిగా దొరుకుతాయి. బత్తాయి, ఆరెంజ్, ఆపిల్, ద్రాక్ష, సపోటా మామిడి వంటి పండ్లతో బౌల్ నింపు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొంటే అలంకరణ, ఆకర్షణతో పాటు భోజనానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ప్రయత్నించి, ఈ వేసవికి వంటగదిని ఆకర్షనీయంగా తీర్చిదిద్దుకోండి.

English summary

Decor Ideas For Summer Kitchen...! | ఒక్కో సీజన్ కి ఒక్కో అలంకరణ...!

Changed the look of the house? What about your kitchen? You can decorate your kitchen this summer with bright colours and accessories. With the seasonal and climate change, you can easily set up a theme. Renovate your kitchen this summer with these cheap decor ideas.
Story first published:Monday, May 14, 2012, 12:14 [IST]
Desktop Bottom Promotion