Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆకర్షణీయంగా గెస్ట్ రూమ్ అలంకరణ ఎలా..!?

1. సాధారణంగా గెస్ట్ రూమ్ అంటే చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడాలి. అలా కనబడాలంటే రూమ్ మీడియం సైజ్ లో ఉండాలి. మీర లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ అంత ఉండకుండా చూసుకోవాలి. మనం ఆ గదిని వినియోగించుకోక పోయినా వచ్చే అతిథుల కోసం చక్కగా అలంకరించి పెట్టుకోవాలి.
2. ముఖ్యంగా గెస్ట్ రూమ్ సైజ్ ను బట్టే అక్కడ ఫర్నీచర్ ను అమర్చుకోవాల్సి వుంటుంది. లేదంటే ఎక్కువ ఫర్నీచర్ వేయడంతో చూడటానికి ఇరుకుగా కనబడుతుంది. ఈ గదిలో సింగిల్ బెడ్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ చుట్టాలు ఎక్కువ వస్తారనుకుంటే పుల్ అవుట్ బెడ్ ఎంచుకోవాలి. సోఫా కమ్ బెడ్ తీసుకుంటే మరీ మంచిది. దాంతో స్థలం సేవ్ చేసినట్లు ఉంటుంది. ఆధునికంగాను కనబడుతుంది.
3. గెస్ట్ రూమ్ ను, మిగతా రూమ్ ల కంటే ఎక్కువగా ఉపయోగించరు కాబట్టి అందులో విలువలైనటువంటి వస్తువులను అమర్చ కూడదు. ఎక్కువ నేచ్యురల్ గా ఉండేవిధంగా చూసుకోవాలి. అలాగే శిల్పాకృతులు లాంటివి అమర్చినప్పుడు అవి ఎప్పుడూ ప్రకాశవంతంగా కనబడే విధంగా చూసుకోవాలి. అప్పడప్పుడు శుభ్రం చేస్తుండాలి. అలాగు గెస్ట్ రూమ్ లో ఫ్యామిలీ ఫోటోలు కాకుండా కళాత్మకమైన ఫోటలు, ఫ్రేమ్ లు అలంకరించడం మంచిది. అలాగే గెస్ట్ రూమ్ లో అలంకరించే పరదాలు, బెడ్ షీట్స్, టేబుల్ కవర్స్ వంటివి తెలుపు రంగు ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువగా మాసిపోయి. శుభ్రం చేయడానికి కష్టం అవుతుంది. గోడలకు ప్రకతి సహజమైనటువంటి వాల్ పేపర్ అమర్చుకోవచ్చు. గదిలో వేసే రంగు మాత్రం తెలుపు లేదా లేత రంగులు కనుక వేయిస్తే ఆ గది అందంతో పాటు ఆహ్లాదంగా కనిపిస్తుంది.
4. లైటింగ్: ముఖ్యంగా గెస్ట్ రూమ్ లో లైటింగ్ బాగా ఉండేట్లు చూసుకోవాలి. దాంతోనే ఆ గది అలంకరణ ప్రకాశించేలా చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కాంతి వంతవైన లైట్స్ కాకుండి మీడియం, లేదా లో లైటింగ్ ఇచ్చేటటువంటి బల్బ్ లను ఉపయోగించాలి. అలాగే బెడ్ ప్రకన రీడింగ్ టేబుల్ ల్యాంప్ లేదా రీడింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి బల్బ్ ను అమర్చుకోవచ్చు.
5. గెస్ట్ రూమ్ ను ఫ్యాన్సీగా అలంకరించే కంటే, ఉపయోగకరంగా ఉండేవిధంగా అలంకరించుకోవాలి. వచ్చిన అతిథులు ఆ గదిలోకి ప్రవేశించగానే సౌకర్యవంతంగా ఫీల్ అయ్యే విధంగా అలంకరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
6. గెస్ట్ రూమ్ లో సహజ సౌందర్యం కోసం.. ఎప్పుడూ తాజా పువ్వులతో అలంకరించిన ఫ్లవర్ వాజ్, ఫ్లోటింగ్ ఫ్లవర్ బౌల్స్ అమర్చితే అతిథులను స్వాగతించినట్లు మనస్సులని ఆకట్టుకొంటాయి.
7. గెస్ట్ రూమ్ లో సౌకర్యవంతమైన కుర్చీలను అమర్చినట్లైతే, అతిథులో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, బుక్స్ చదువుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
8. గెస్ట్ రూమ్ లో మురో ముఖ్యమైన అలంకరణ మ్యూజిక్ సిస్టమ్. అతిథులు నిద్రకు ఉపక్రమించే ముందు మంచి మ్యూజిక్ వినడానికి, ఒక మ్యూజిక్ సిస్టమ్ ను అమర్చితే మంచిది.



Click it and Unblock the Notifications