Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆహ్లాదకరమైన వాతారణంలో వెన్నెలను తలపించే బెడ్ రూం...

అందుకే చదివి పత్రికల్ని ఏ రోజుకారోజు సర్దేయడం ఓ అలవాటుగా పెట్టుకోవాలి. నెలకోసారి వాటిని అమ్మేయాలా, ఏదైనా ఎన్జీవోకు ఇచ్చేయాలా అన్నదీ ఆలోచించి పని పూర్తి చేసుకోవాలి. అప్పుడు గది కూడా అందంగా కనిపిస్తుంది. రోజూ చదివే పుస్తకాలు, ఇతర మ్యాగజైన్లను కూడా మంచాల దగ్గర కాకుండా వెడల్పాటి వెదురు బుట్ట లాంటి దాంట్లో వేసుకుని గదిలో ఓ పక్కన ఉంచాలి. చూడటానికి బాగుంటుంది. అవసరమైనప్పుడు తీసి చదువుకోవచ్చు.
బెడ్ రూం వాతావరణం ఆహ్లాదంగా కనిపించాలంటే గోడలను అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ కుటుంబసభ్యుల ఫోటోలను గోడలపై అక్కడక్కడా తగిలించుకోవాలి. అది కుదరనప్పుడు జలపాతాలు, పచ్చిన చెట్లు, కొండలు, వంటి ప్రకృతి దృశ్యాలను వాల్ పేపర్లలా అమరిస్తే..గోడలు నిండుగా కనిపిస్తాయి.
ఇక గాలి వెలుతురు విషయంలో గాలి దారాళంగా ప్రవహించేలా చూసుకోవాలి. సాద్యమైనంత వరకు గాలి వెలుతురు ఎక్కువగా ఉండేటట్లు విండోలు, డోర్లు అమర్చుకోవాలి. రాత్రిటైమ్ లో వెలుతురు బాగుండాలంటే కొత్త బల్బులు అమర్చాలి. రాత్రిళ్లయితే..మసక వెలుతురు ఉండేలా చూసుకుంటే..అలసిన మనసుకు స్వాంతన చేకూరుతుంది. వెన్నెల్లో ఉన్న భావన కలుగుతుంది.
ఇక ఫర్నీచర్ విషయంలో ముఖ్యం బెడ్ రూంలో మంచాలపై దుప్పట్లను వారానికోసారి మారుస్తుండాలి. సాధ్యమైనంతవరకు తెల్లదుప్పట్లు కాకుండా రంగురంగుల పువ్వులు, లతలు..ఇతర డిజైన్లలో ప్రకాశవంతమైన రంగుల్లో మెరిసిపోయే వాటిని ఎంచుకోవాలి. దిండ్లను కూడా ఏళ్లతరబడి వాడుతుంటే మార్చేయడమే ఉత్తమం. కొత్తగానే కాదు మీకూ పౌకర్యవంతంగా అనిపిస్తుంది. కిటికీలకు వేసే పరదాల ఎంపికా ప్రత్యేకంగా ఉండాలి. లేత రంగుల్లో తేలికైన వస్త్రాల్లో చిన్న చిన్న డిజైన్లలో ఎంచుకుంటే చాలా బాగుంటుంది.
తాజాపువ్వుల నుంచి వచ్చే పరిమళం..ఒత్తిడి ఆవరించిన శరీరానికి ఉపశమనాన్నిస్తుంది. ఫ్లవర్ వాజ్ లో ఒకటి రెండు పువ్వుల్ని వేసి..గదిలో ఓ మూల అమరిస్తే చూడటానికి చాలా హాయిగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ వాజులోని పువ్వులు ఆకులు మార్చడం కష్టమనుకుంటే కృత్రిమ పువ్వుల వాజును గదిలో ఎంచుకోవాలి. బెడ్ రూంలో కేవలం మంచం, టేబుల్ మాత్రమే ఉంటే కూర్చునేందుకూ వీలుగా రెండు కుర్చీలు కూడా ఓ మూల వేసుకొంటే అవి మరింత సౌకర్యంగా అనిపించేందుకు కుషన్లే కూడా వేస్తే పుస్తకం, పత్రిక లాంటివి చదవడానికి వినియోగించుకోవచ్చు.
అలసిన మనసుకు ఆహ్లాదం కలిగించాలంటే..ఆరోమా కొవ్వొత్తుల్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే అవి కనీసం ఒకటి రెండయినా ఉండాలి. సాయంత్రాల్లో వాటిని వెలిగించవచ్చు. అవి ఒకేలా కాకుండా రకరకాల రంగుల్లో, డిజైన్లలో ఎంపిక చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications