Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కలిసి ఆనందించే అద్భుతం సౌకర్యం...

డ్రాయింగ్ రూమ్‌ను ఎలా సర్దుకోవాలంటే అందులోకి ప్రవేశించగానే విశ్రాంత భావన పొందేలా చూసుకోవాలి. డ్రాయింగ్ రూంలో కార్పెట్ తో పాటు ఖరీదైన ఫర్నిచర్ ఉన్న ఒక్క గదిచాలు డ్రాయింగ్ రూం అందాన్ని పెంచేందుకు...‘వామ్’ లుకింగ్ ని ఇస్తుంది. కనుక ఫర్నిచర్‌ను గోడలకు తగిలించి పెట్టడం కాకుం డా దాన్ని మధ్యలో గుండ్రంగా వచ్చేలా సర్దుకుంటే వచ్చిన అతిథులు కూడా సౌకర్యాన్ని పొందగలుగుతారు.
డ్రాయింగ్ రూమ్ లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్ ను అమర్చుకోవచ్చు. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్ లు ఏవిధంగా ఉంటే ఇతరులను ఎక్కువగా ఆకర్షించ కలుగుతుందో అలా అమర్చుకోవాలి.
డ్రాయింగ్ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాటిని సరిగా పెట్టకపోతే ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. అందుకే వాటిని ఏర్పాటు చేసే సమయంలో అవి మీకిష్టమైన వాటిని, మీరు పదే పదే చూడాలనుకునే వాటినీ ప్రతిఫలించేలా ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు కిటికీలోంచి మీకిష్టమైన సీనరీని చూసేలా...సర్ధుకోవాలి. ఫర్నిచర్ ను గోడలకు తగిలించి పెట్టడం కాకుండా దాన్ని మధ్యలో గుండ్రంగా వచ్చేలా సర్దుకుంటే వచ్చిన అతిథులు కూడా సౌకర్యాన్ని పొందగలుగుతారు.
డ్రాయింగ్ రూంను అట్టహాసంగా ఏర్పాటు చేసుకుంటున్నామనే భావనతో కిక్కిరిసిపోయినట్టుగా ఫర్నిచర్‌ను పెట్టకూడదు. అలాగే టివిని లేదా సౌండ్ సిస్టంను ప్రముఖంగా పెట్టకూడదు. మెత్తటటి కుషన్లను లేదా పువ్వులను పెట్టి దాన్ని మరింత ఫెమినైన్‌గా ఉం డేలా చూడాలి. అలా అని ఎండిపోయిన పువ్వుల ను పెట్టకూడదు. ఇక డ్రాయింగ్ రూంకు వేసే రంగులు లేతవిగా, ఆహ్లాదం కలిగించేవిగా ఉండాలి. పేసల్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications