Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫ్లవర్ వాజులు మిలమిల మెరవాలంటే...

1. మీ దగ్గర సిరామిక్ వాజులు ఎక్కువగా ఉన్నాయా? ఏం చేయాలంటే..ముందుగా వాటిని గోరువెచ్చటి నీటితో కడగాలి. వాడేసిన టూత్ బ్రష్ లతో లోపలిభాగాన్ని సున్నితంగా రుద్ది..మరోసారి కడగాలి. ఇప్పుడు కాసిన్ని నీటిలో వంటసోడా, అమోనియా, వెనిగర్ ను సమపాళల్లో కలిపి..ఈ మిశ్రమాన్ని వాజులో వేయాలి. గంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. అయినా వదలని మొండిమరకలకు ఏం చేస్తారంటే..వంట సోడా నీటిని వాజులో నింపి..గట్టిగా కుదిపినట్లు చేయండి సరిపోతుంది.
2. ఇంటికే ప్రత్యేక అందం తెచ్చే గాజువాజుల్లో నీళ్లు నింపడం వల్ల లోపలి అంచుల్లో నీటి మరకలు ఏర్పడతాయి. అలాంటప్పుడు వాజు పొడవును బట్టి..అందులో కాస్త బియ్యం నింపాలి. ఆ తర్వాత వెనిగ్ కూడా వేయాలి. వాజు పైభాగాన్ని ప్లాస్టిక్ కాగితంతో చుట్టేయాలి. ఇప్పుడు..గట్టిగా కుదిపినట్లు చేయాలి. దీనివల్ల లోపలిభాగంలో పేరుకున్న మురికి బియ్యానికి అంటుకుంటుంది. ఈ బియ్యాన్ని తొలగించి గోరువెచ్చని నీటితో కడిగేసి పొడిబట్టతో తుడిచేస్తే చాలు కొత్తవాటిలా ఉంటాయి.
3. ప్రత్యేకంగా ఉండే స్పటిక వాజుల శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త తప్పనిసరి. ధారలా వచ్చే కుళాయి నీటితో వీటిని శుభ్రం చేయవచ్చు. అయితే అలా శుభ్రం చేసే ముందు వాజులో నాలుగైదు చుక్కల వెనిగర్ వేస్తే మీ పని మరింత సులువవుతుంది. ఆ తరువాత పొడివస్త్రంతో తుడి చేస్తే చాలు మరకలు మాయం.



Click it and Unblock the Notifications