Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముదురు రంగుల పువ్వులతో మరింత ఆకర్షణ...!

1. పువ్వులతో పాటు మధ్య మధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్ళలో మునగ కూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్ వాజ్ అందంగా ఉంటుంది. ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
2. ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.
3. ఫ్లవర్ వాజ్ లో పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
4. బాగా వికసించిన ముదురు రంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.
5. ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకే చోట కాకుండా మ్యాచింగ్ వుండేలా చూడాలి.
6. పువ్వుల రంగు గది కర్టెన్ రంగుతో మ్యాచ్ అయితే ఆనందానుభూతి ఎక్కువ.
7. ఫ్లవర్‌వాజ్ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్ళల్లో కాస్తంత ఉప్పు కలపాలి. పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.
8. ఫ్లవర్‌వాజ్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి.
9. ఇంట్లో ఇండోర్‌ప్లాంట్స్, మనీప్లాంట్స్, కొన్ని రకాల క్రోటన్ మొక్కలు కుండీలో వేసి గదుల్లో డ్రాయింగ్ రూంలో అలంకరించుకోవచ్చు.
10. మొక్కలు మనకు ఆక్సిజన్ ప్రసాదించి, మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని మనకు ఎంతో మేలు చేస్తాయి. తద్వారా మనకి మంచి ఆరోగ్యకర వాతావరణం లభిస్తుంది.



Click it and Unblock the Notifications