For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదే ఇల్లు, అవే వస్తువులు.. కొంచెం కొత్త , కొంచెం వింత

|
Give A Fresh New Look to Your Home....!
ఇంటికి కొత్త అందాన్ని తేవాలంటే... బోలెడు డబ్బు పెట్టి ఖరీదైన వస్తువులే కొనాల్సిన అవసరంలేదు. ఉన్న వాటినే చిన్న చిన్న మార్పులు చేస్తే...కొత్త కళ వస్తుంది. అలాంటి సూచనలే ఇవన్నీ. మన శక్తిని బట్టి చిన్నదో, పెద్దదో మనకంటూ ఓ ఇల్లు ఉంటుంది. ఎన్ని గదులు అయితేనేం మొత్తానికి అది మన ఇల్లు. అది సొంతదే కానక్కరలేదు. అద్దె చెల్లిస్తున్నంతవరకూ అది మన ఇల్లే. పొద్దుట్నించీ సాయంత్రం దాకా వృత్తి ఉద్యోగాలతో బయటే సరిపోతుంది. రోడ్లమీద, ఆఫీసుల్లో ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. అక్కడ మన ఇష్టం వచ్చినట్లు ఉండలేం. కానీ మన ఇంట్లో మాత్రం యధేచ్చగా ఉండొచ్చు. ఇంట్లో ఉన్న స్వేచ్చ , సంతోషాలు మరెక్కడా దొరకవు. అందుకే "ఇల్లే కదా స్వర్గసీమ" అన్నారు.

ఇంట్లో మన సౌకర్యార్ధం టీవీ, ఫ్రిజ్జు, వాషింగ్ మెషిన్ - ఇలా బోల్డన్ని వస్తువులు కొంటాం. వాటిని డ్రాయింగ్ రూం లో, డైనింగ్ హాల్లో, కిచెన్లో వీలును బట్టి సర్దుకుంటాం. అప్పటికి అది బాగుంటుంది.

కానీ... కొన్నాళ్ళు గడిచాక రొటీన్ గా అనిపిస్తుంది. కూరలు, చీరలు, నగలూ నట్రా లాగానే ఇంటి విషయంలోనూ మార్పు కావాలనిపిస్తుంది. అయితే దుస్తులు మార్చినట్లుగా ఇంటిని మార్చడం సాధ్యం కాదు. పాత వస్తువులను మార్చి కొత్త వస్తువులను కొనుగోలు చేయడమూ కుదరదు. అంత అవసరం కూడా లేదు. అయితే మనసుంటే మార్గం ఉంటుంది. అదే ఇంటిని, అవే వస్తువులతో మార్పును తీసుకురావచ్చు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులు 'భలే ఉందే.. ఎం చేశారు, ఏదో కొత్తకొత్తగా వింత అందం కనిపిస్తోంది' అనేస్తారు.

అందుకోసం ఏం చేయాలంటే...సోఫాలు, టేబుళ్ళు మొదలైన వాటిని స్థల మార్పిడి చేయండి. చేయాలి కదా అని ఫ్రిజ్జును తీసికెళ్ళి ముందు గదిలో పడేయలేం. మనకు సౌకర్యంగా ఉంటూనే కొత్త శోభ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. డైనింగ్ టేబుల్ మొదలైనవాటికి కవర్లు మారిస్తే సరి, మరింత కొత్తదనం వస్తుంది.ఇది చాలా సింపుల్.

గది మధ్యలో సోఫా, దానికి ఇరువైపులా కుర్చీలు, మధ్యలో టీపారు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ అదే తరహా అంటే మాత్రం.... అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే ...సోఫాను మధ్యలో కాకుండా గోడ పక్కన ఉంచితే గది విశాలంగా ఉంటుంది. అలాగే సోఫాల పక్కన చిన్న పూలకుండీని ఉంచితే...ఆ ప్రత్యేకతే వేరు.

ఇందుకు ఖర్చు పెట్టాల్సింది ఏమీ ఉండదు. కావలసిందల్లా కాస్తంత కళా హృదయం. కొద్దిగా శ్రమ పడితే చాలు మళ్ళీ కొన్నాళ్ళపాటు ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. పాతబడింది అనుకున్నప్పుడు మళ్ళీ మారిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొత్త కళ రావడమే కాదు నూతనోత్సాహమూ వస్తుంది.

English summary

Give A Fresh New Look to Your Home....! | అదే ఇల్లు... అవే వస్తువులు...బోరుకొడుతోందా...


 A good home decoration can give an entirely new look to one's home. These days, people often employ professional home decorators to give that unique look to the interiors of their homes. Let us have a look at some of the intricacies of this emerging field.
Story first published: Monday, September 3, 2012, 8:54 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more