Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఉడెన్ ఫర్నీచర్ తో ఇంటికి సొంపు...కంటికి ఇంపు...

ఇంటిని కళాత్మకంగా రూపొందించేందుకు ఇంటీరియర్ డిజైనర్లున్నా కాస్త అభిరుచి, ఇంకాస్త శ్రద్ధ జోడిస్తే ఇంటిని ఇంద్రభవనంలా మార్చుకోవచ్చు. ముందుగా గోడలు, తలుపులకు చూడ సొంపైన రంగులు పడాలి. రంగుల్లో ఖరీదైనవి, చవకైనవి రెండూ దొరుకుతాయి. వేటిని ఎంచుకున్నా మరీ కొట్టొచ్చినట్టు లేదా పూర్తిగా తేలిపోయేట్టు వుండేవి కాకుండా కంటికి ఇంపైన రంగులను ఎంచుకుంటే ఇల్లు ఆకర్షణీయంగా వెలిగిపోతుంది.
కనీసం ప్రతి మూడేళ్ళకోసారి రంగులు వేయిస్తే ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబవుతుంది. ఆపైన తలుపులు, కిటికీలకు కర్టెన్లు అమర్చినట్లయితే మరింత అందంచేకూరుతుంది. చూడముచ్చటైన డిజైన్లు, రంగుల కాంబినేషన్లతో, అంచులకు లేసులు వుండే కర్టెన్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి ఇంటి గుట్టు బయటేయకుండా, ఎండపొడ లోనికి రాకుండా చేయడమే కాదు బోల్డంత అందాన్ని, నిండుదనాన్ని తెస్తాయి. కర్టెన్ల రంగులు గోడల రంగులకు మ్యాచ్ కావాలండోయ్.
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వంటిల్లు మొదలుకుని.. డ్రాయింగ్ రూమ్ దాకా చెక్క సామగ్రి వాడకం సర్వసాధారణం. ముఖ్యంగా వంటింట్లో చెక్క పాత్రలు, గరిటెల వాడకం బాగా పెరిగింది. ఎంతో ఖరీదైన ఈ చెక్క వస్తువులు సూర్యరశ్మి, పొడి వాతావరణం కారణంగా తొందరగా పాడవుతాయి. అయితే వీటిని ఉపయోగించటంలో కొన్ని చిట్కాలను పాటించినట్లయితే... ఎంతో కాలం మన్నుతాయి.
సాధ్యమైనంతవరకూ వీటికి నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి. ఇండోర్ మొక్కలు, నీటితో నింపిన పాత్రలు ఇంట్లో అక్కడక్కడా పెట్టడం వల్ల, తేమ ఏర్పడి ఫర్నీచర్ త్వరగా పాడవకుండా ఉంటుంది. టేకు ఫర్నీచర్ గనుక వాడుతున్నట్లయితే... ఏడాదికి రెండుసార్లు టీక్ ఆయిల్ లేదా క్రీమ్‌ను వాడాలి. వైర్ ఊల్ సహాయంతో చేతికి గ్లోవ్స్ వేసుకుని ఫర్నీచర్‌కు పట్టిస్తే, చేతికి అంటుకోకుండా ఉంటుంది.
ఓక్ ఫర్నీచర్ వాడుతున్నట్లయితే, వాటిని శుభ్రంగా తుడిచి, వెచ్చటి వెనిగర్‌తో పాలిష్ చేస్తే ఇట్టే మెరిసిపోతాయి. కొత్తగా కొనే చెక్క పాత్రలను రాత్రంతా సెడర్ వెనిగర్‌లో ముంచి ఉంచినట్లయితే, ఆయా పాత్రలు కూరల వాసనను పీల్చుకోకుండా ఉంటాయి. మరుసటి రోజు పేపర్ టవల్స్‌తో పొడిగా తుడిచేస్తే సరిపోతుంది. సలాడ్ల కోసం వాడే చెక్క పాత్రలను సబ్బుతో కడగకుండా.. ఆలివ్ ఆయిల్‌లో ముంచిన వస్త్రంతో బాగా తుడిచి, గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఆరిన తరువాత నూనెను మళ్లీ పైపైన పూయాలి. ఈ చిన్ని చిట్కాలను పాటించినట్లయితే... మీ ఇంట్లోని ఉడెన్ ఫర్నీచర్ కొత్త అందంతో మెరిసిపోతుంది సుమా..!



Click it and Unblock the Notifications