For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ఇంటిని అందంగా డెకరేట్ చేయడం ఎలా...!

|

సాధారణంగా దీపావళికి ముందుగా మీరు ఎవరినైనా దీపాళికి ఇంటి డెక్షరేషన్ పూర్తి చేసేసి సంతోషంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేదనే చెబుతారు. సాధారణంగా ఇంటి డెకరేషన్ ఎంత చేసినా మనకు ఆనందం అనిపించదు. ఏదో కొరతగానే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వాటిని సక్రమంగా నిర్వర్థించేలేకపోవడం లేదా కొన్ని వస్తువులు ఖరీదు ఎక్కువగా ఉండటం చేత సరైన డేకరేషన్ చేయలేక కొంత అసంతృప్తిగానే ఉంటుంది. అయితే దివాళీ వచ్చేసింది కనుక ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి.

మన సాంప్రదాయం ప్రకారం చాలా మంది ఇండ్ల్లకు పెయింటింగ్ చేయిస్తుంటారు. అలాగే ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా పూర్తి చేయిస్తుంటారు. ఈ సంవత్సరపు దీపావళికి కూడా ముందులాగే అదే పెయింటింగ్... అదే డెకరేషన్ వేసుకోకుండా కొంచెం డిఫరెంట్ గా అలంకరణ చేయండి. మామూలుగా ఉన్న వంటగదిని కొంచెం మాడ్రెన్ కిచెన్ గా అరేంజ్ చేసుకోండి. మోడ్రన్ మోడల్ కిచెన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరియు వంట చేయడానికి చాల ఉత్సాహంగా ఉంటుంది. ఇలా మోడ్రన్ కిచెన్ ఉండటం వల్ల మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తర్వాత అతి ముఖ్యంగా శ్రద్ద తీసుకోవల్సిన ప్రదేశం స్నానాలగది. ఎప్పుడు నీటి ప్రవాహం ఉండటం వల్ల అతి త్వరగా పాడవుతుంటాయి. కాబట్టి ముందుగా వాటి మరమత్తులు చేయాలి. ఇలా మరమత్తలు కొత్తగా చేస్తున్నట్లైతే బాత్ రూమ్ లోని పాత వస్తువులన్నీ తొలగించి కొత్తవాటిని ఫిక్స్ చేసుకోవాలి. మోడ్రన్ బాత్ టబ్, వాష్ బేషిన్, క్యాప్ ష్యూల్ షవర్ లాంటివి కొత్త వాటిని అమర్చుకోవడం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది.

ఇక దీవాళి సెలబ్రేషన్స్ అంతా జరుపుకొనేది లివింగ్ రూమ్ లో. వరండా, హాల్ ను అందంగా.. ఆకర్షణీయంగా అలంకరణ చేసుకోవాలి. కుంటుంబ సభ్యులంతా ఎక్కువ భాగం కూర్చొనే ప్రదేశం లివింగ్ రూమ్. కాబట్టి ఆ గదికి కొంచెం ప్రత్యేకమైన అలంకరణ జోడించి ప్రశాంతంగా ఉండేలా డెకొరేట్ చేయండి.

ఇక పిల్లలు ప్రశాంతగా ఉండటానికి, మీ బెడ్ రూమ్ ను కొన్ని ప్రశాంతమైనటువంటి, కూల్ కూల్ గా కొన్ని ఉపకరణాలతో విలాసవంతంగా డెకరేట్ చేయండి. చాలా వరకూ పిల్లల కోసం ఓ ప్రత్యేకమైన గదిని వారికి ఇష్టమైనవిధంగా ఈ దీపావళికి అలంకరించడం వల్ల వారు ఎంతో సంతోషపడుతారు. అలాగే పెద్దలు సేదతీరే బెడ్ రూమ్స్ ను కూడా వారికి నచ్చిన విధంగా అలంకరించుకోవడం చాలా ముఖ్యం.

కాబట్టి ఈ దీపాళి డెకరేషన్ కోసం మీరు ఇబ్బంది పడకుండా ఉండేదుకు కొన్ని డెకరేషన్ ఐడియాస్ మీకోసం...

లివింగ్ రూమ్...

లివింగ్ రూమ్...

టైల్స్, మెజాయిక్ వంటివి ఇప్పుడు పాతబడింది. ప్రస్తుతం న్యూట్రెండ్ ను తలపిస్తున్నది వుడ్ తో కవర్ చేయడం వల్ల చాలా మోడ్రన్ గా కనబడుతుంది. వుడ్ ఫ్లోర్ మరియు వాల్స్ కు కూడా అమర్చుకోవచ్చు. ఇంట్లో వస్తువులు బ్రైట్ కలర్ గా కనిపించడం కోసం, మరియు కలర్ కాంబినేషన్ సెట్ అయ్యేలా వుడ్ ను సెలక్ట్ చేసి ఫిక్స్ చేయడంతో ఇల్లు మరింత ఆకర్షనీయంగా కనబడుతుంది.

సిట్టింగ్ ప్లేస్

సిట్టింగ్ ప్లేస్

మీకోసం కొంత స్థలం ప్రత్యేకంగా ఏర్పరుచుకోవండి. లివింగ్ రూమ్ లో ఒక సైడ్ కార్నర్ లో కూర్చోవడానికి అనుకూలంగా కాఫీ టేబుల్, కుర్చీ, టేబుల్ ల్యాంప్ వంటివి అమర్చుకోండి. వాటికి సూట్ అయ్యే విధంగా ఈ గదికి పేయింట్ వేయించుకోండి. చూడటానికి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కనబడుతుంది.

మోడ్రన్ కిచెన్

మోడ్రన్ కిచెన్

ప్రస్తుతం అన్ని మోడ్రన్ అయిపోయాయి. అన్నింటికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీ ఇల్లు మరింత ఆకర్షనీయంగా, సౌకర్యంగా కనబడటం కోసం మోడ్రన్ మోడ్యులార్ కిచెన్ ను అమర్చుకోవడం మంచిది. ఈ మోడ్రన్ కిచెన్ లో చాలా క్యాబినెట్స్ మరియు కుకింగ్ ఓవెన్ విత్ చిమ్నీ ఇన్ స్టాల్ చేయబడం ఉంటుంది.

కిడ్స్ బెడ్ రూమ్

కిడ్స్ బెడ్ రూమ్

సాధారణంగా పిల్లలు ఎప్పుడూ కొత్తగా వైరైటీగా కోరుకుంటారు. వారి బెడ్ రూమ్ ను రకరకాల బొమ్మలు, కలర్ఫుల్ గా కనబడేలా చేస్తే వారు చాలా సంతోషపడుతారు.. వారి బెడ్ రూమ్ లో వస్తువులు, కలర్ ఫుడ్ బెడ్ కవర్స్, మరియు కుషన్స్, అందమైన స్టడీ టేబుల్ అమర్చాలి.

 గెస్ట్ రూమ్

గెస్ట్ రూమ్

ఈ దీపావళికి మీ ఇంటికి విచ్చేసే అథితులను మీ చాతుర్యంతో సర్ ప్రైజ్ చేయాలి. గెస్ట్ రూమ్ లో ఒక బెడ్, దాని పక్క సైడ్ టేబుల్, వంటివి సెట్ చేయాలి. ఇవి చూడటానికి చాలా సింపుల్ గా, అందంగా ఉండేలా చేయాలి. ఆ గదిలో వాల్ ఆర్ట్, మరియు లాంప్ టేబుల్ వంటివి అమర్చడం వల్ల మరింత ఆకర్షనీయంగా కనబడుతుంది.

మాస్టర్ బెడ్ రూమ్

మాస్టర్ బెడ్ రూమ్

ప్రస్తుతం శీతాకాలం మొదలైంది. కాబట్టి మాస్టర్ బెడ్ రూమ్ లో వెచ్చదనం ఉండేలా కొంచెంద మందంగా ఉన్న బెడ్ కవర్స్, కుషన్స్, పిల్లోలను అమర్చాలి. అలాగే మెజాయిక్ ను కలర్ ఫుల్ గా వేయించాలి. దాంతో ఆ గదికి మరింత అందం చేకూరుతుంది.

బాత్ రూమ్

బాత్ రూమ్

చాలా సాధారణంగా మీ బాత్ రూమ్ ను అలంకరించుకోవాలంటే.. బాత్ రూమ్ టైల్స్ ను మార్చాలి. మీకు నచ్చని మంచి క్వాలిటీ ఉన్న అద్దాన్ని బాత్ రూమ్ లో అమర్చుకోవాలి. ఇంకా మీ బాత్ రూమ్ యొక్క స్థలాన్ని బట్టి బాత్ టమ్ మరియు షవర్ వంటివి అమర్చుకోవచ్చు

English summary

Give Your Home A Makeover This Diwali |అందమైన ఇంటికి దీపావళి డెకరేషన్...|

If you ask anyone if they are completely happy with the décor of their house, they would say 'no'. We all like to give our homes a makeover every now and then. But few factors like disturbance caused by the renovations and cost holds us back.
Desktop Bottom Promotion