Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటీరియర్ డెకరేషన్ లో వాస్తు ప్రభావం...!

గదిలో దక్షిణాన కీన పశ్చిమ భాగాన కానీ సోఫాను పెట్టుకోవచ్చు. సోఫాలో కూర్చునే వారు ఉత్తరం లేక తూర్పు దిక్కుగా కూర్చోవాలి. నైరుతి మూల ఖాలీగా ఉంచి నైరుతి దిక్కుగా బెడ్ ను అమర్చుకోవాలి. విలువైన వస్తువులు నైరుతి మూలన కొంచెం ఖాళీగా వదిలేసి అక్కడే ఉత్తరముఖంగా అమర్చాలి. వంటగది, లివింగ్ రూం, లేక డైనింగ్ రూంలో వాయువ్వ దిశలో డైనింగ్ టేబుల్ అమర్చాలి. గదిలో ఉత్తరంలో కానీ తూర్పున కానీ చదువుకునే బల్లను అమర్చుకోవాలి. ఉత్తరం లేక తూర్పు లేక ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచితే మంచిది. ఉత్తరం, తూర్పు,ఈశాన్యం నీటిని ఉంచే దిక్కులు
ఇంట్లో అలంకరించుకొనే కర్టెన్లు: బెడ్ రూంలో తేలికరంగు కర్టెన్లు అమర్చుకోవాలి. పడకదిలో ఎరుపు, నల్లరంగు కర్టెన్లు వాడకపోవడమే మంచది. లివింగ్ రూంలో ముదురురంగు కర్టెన్లు వాడుకోవచ్చు. ఇక ఇల్లల్లో అమర్చుకొనే అద్దాలు: గదిలో ఉత్తరం లేక తూర్పు గోడకు అద్దాలు అమర్చుకోవచ్చు. ఇక చదువుకునే గదిలో, బెడ్ రూంలో పక్కకు ఎదురుగా అద్దం అమర్చకోకూడదు.
విద్యుత్ పరికరాలు: ఇంట్లో ప్రతి నిత్యం ఉపయోగించి విద్యత్ పరికరాలను కూడా సరైన దిక్కున ఉంచాలి. గ్యాస్, ఓవెన్ ల, మైక్రోవేవ్ వంటి వేడిచేసే పరికరాలు ఆగ్నేయం దిశల్లో అమర్చుకోవాలి. గీజర్ కూడా బాత్ రూంలో ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి. కూలర్, ఏసి, ఫ్రిజ్ వంటివి గదిలో వాయవ్యంలో అమర్చుకోవాలి. గదిలో ఉత్తరం, తూర్పు లేక ఆగ్నేయంలో టీవీ పెట్టుకోవచ్చు. గది ఈశాన్యంలో విద్యుత్ పరికరాలు ఉండకూడదు.
పెయింటింగ్ రంగులు: వాస్తు ప్రకారం లేత రంగు పెయింట్ మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, గులాభీ, గోధుమ రంగులు గదులకు వేసుకోంటే చాడటానికి అందంగా ఉంటుంది. ఎరుపు, నల్ల రంగులు ఇంట్లో వాడవకపోవడమే మంచిది. ఇక పెయింటింగ్ ప్రతిమల అలంకరణ విషయంలో సూర్యోదయం, జలపాతం వంటి ప్రతిమలు ఇంట్లో వాడితే మంచిదని వాస్తు సూచిస్తోంది. యుద్దం, హింసను ప్రతిబింబించే చిత్రాలను ఉపయోగించకూడదు. పడకగదిలో దేవతామూర్తులను ఉంచకూడదు. వినాయకుడి బొమ్మలను అలంకార సామాగ్రిగా వాడడం బాగా ప్రజాదరణ పొందింది. దేవతా విగ్రహాలను పూజ గదిలో ఉంచుకోవడమే ఉత్తమమైన పని.
ఇంట్లో మొక్కలు: ఇంట్లో మొక్కలు పెంచుకవాలను కొనే వారు, ఇంటి అలంకరణలో ఇండోర్ మొక్కలు ఎంతో ప్రజాదరణ పొందాయి. బ్రహ్మజెముడు, ముళ్ళమొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు. ఇంట్లో ఈశాన్యంలో పెద్ద మొక్కలు పెంచుకోకూడదు.



Click it and Unblock the Notifications