Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

వంటిల్లు అనగానే నోరూరించే వంటకాలతో పాటు పొగ, నూనె మరకలతో ఉండే గోడలు, మసిబారిన గిన్నెలు, రకరకాల వాసనలు గుర్తొస్తాయి. అయితే హాయిగా నిద్దరోయే పడకగది ఎంత అందంగా ఉండాలనుకుంటారో, తలచుకుంటే వంటగదిని కూడా చక్కగా తీర్చిదిద్దవచ్చు. అందమైన వాతావరణంతోపాటు ఆరోగ్యాన్నీ పొందవచ్చు.
వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగ, తేమ, ధూళి, అనవసరమైనటువంటి వాసనలు మొదలగువాటి వల్ల గోడలు, సీలింగ్స్, కార్పెట్స్, ఫర్నీచర్ పాడవుతాయి. అలా కాకుండా ఉండాలంటే, వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫ్యాన్ ఉన్నట్లయితే మీ వంటగది గోడలు మసిబారిపోయే సమస్య ఏర్పడదు. వంట చేస్తున్నప్పుడు ఎర్పడే మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోజన్ వంటి హానికరమయిన వాయువులను ఎగ్జాస్ట్ ఫ్యాన్ తక్షణం బయటకు పంపుతుంది.
ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను గ్యాస్‌స్టవ్‌కు కొంచెం దూరంలో (పై భాగాన కొంచెం ఎత్తులో) ఉండేలా చూడాలి. లేదంటా వంటగదిలో వంట చేసేటప్పుడు ఆ వాసలంతా ఇంటి నిండా నిండిపోయి కలుగజేస్తుంది. కూరలలో వేసే తాలింపు వల్ల వచ్చే పొగను ఈ ఫ్యాన్ తక్షణం వెలుపలికి పంపు మీ గోడలు పాడుగాకుండా చూడటమేగాక మీ ఆరోగ్యం గోడలా గట్టిగా ఉండేందుకు సహకరిస్తుంది.
వంటగదిలో వచ్చే వాసనలు, పొగల వల్ల వచ్చేటటువంటి ఆస్తమా, అలర్జీ, చర్మం పొడిబారంటం, తలనొప్పి, జలుబు, ఇతర శ్వాసకోస సంబంద రోగాల నుండి బయటపడవచ్చు. ఇన్నిరకాలుగా ఉపయోగపడే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఈ ఫ్యానులో ఉన్న చారోకోల్ ఫిల్టర్ మరియు మెటల్‌గ్రీజు ఫిల్టర్లు ఇందుకు సహకరించి వంటగదిని పూర్తిగా మట్టి నుండి విముక్తి చేస్తాయి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంపిక చేసుకొనే విధానంలో కూడా మెలుకువలు పాటించాలి. ముఖ్యంగా చూడటానికి అందంగా, శక్తి, సామర్థ్యం కలిగి ఉండేది ఎంపిక చేసుకోవాలి. ఇందులో కూడా వివిధ రకాలు కలిగి ఉన్నాయి. అందులో డెకరేటివ్ సీలింగ్ ఫ్యాన్, డొమెస్టిక్ డెస్క్, బాంక్, వాల్, సీలింగ్, ఫ్లోర్ ఫ్యాన్స్, కమర్షియల్ టైప్ వాల్ మరియు పెడెస్టియల్ ఫ్యాన్స్. ఇవికూడా డిపరెంట్ సైజ్ లో దొరుకుతాయి. కాబట్టి మీ వంటగది చిన్నాదా పెద్దదా అన్న విషయాన్ని దష్టిలో పెట్టుకోని ఎంపిక చేసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి వచ్చేటటువంటి శబ్దం ఇతరులకు ఇబ్బంది కలిగించేటి ఎన్నుకోకూడదు. లో రెసిస్టెన్స్ సున్నితంగా ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications