For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మండే ఎండల్లోనూ ప్రశాంతమైన..చల్లని ఇల్లు...!

|

Home decorating Tips to Keep The Sun Out....!
వేసవిలో ఎక్కువ ఎండలు, వేడితాపం. అందుకు ఏసీలు, కూలర్లు ఉంటే సరే..లేదంటే ఎలా? ఇల్లే పదిలం అనుకుంటూ ప్రతి గదిలో చల్లదనం కోసం ప్రయత్నాలు ఆరంభిచాలి. కర్టెన్ల ఏర్పాటు మొదలుకొని ఇంటికి వేసే రంగుల వరకూ పలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.....

సాధారణంగా మన ఇళ్ళ తీరుననుసరించి..నైరుతి దిశలో పడక గదులుంటాయి. పడక గదిలో ఉండే పెద్ద పెద్ద కిటికీల వల్ల మధ్యాహ్నం పూట తీక్షణమైన ఎండ ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఉదయం పదింటి వరకు కిటికీలు, తలుపులు తెరిచి పెట్టుకోవాలి. చల్లని తాజా గాలి ఇంట్లోకి వస్తుంది. ఇలా ఇల్లు చల్లబడిన తర్వాత ఎండ పెరిగే వేళకి అన్ని తలుపులు వేసేయాలి. ముఖ్యంగా పరదాలు సాయంత్రం ఐదు, ఆరు గంటల వేళ తెరిస్తే తిరిగి గదులు చల్లబడుతాయి.

కిటికీల నుంచే సాధారణంగా అధిక వేడి వస్తుంది. ఇలా వచ్చే వేడి, వెలుతురుని నివారించడానికి రెండింతలు దళసరిగా ఉండే లైనింగ్ వేసిన పరదాలు వాడాలి. అయితే ఇది అన్నివేళలా అనుకూలించదు. ఒక్కోసారి గాలి కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు కిటికీలకు పైన డబుల్ రాడ్లని అమర్చాలి. అవసరం అయినప్పుడు రెండు పరచాలని, లేనప్పుడు ఒక పరదానికి జుపుకోవాచ్చు. ఇలా తీవ్రమైన ఎండని నివారించవచ్చు.

వేసవికాలంలో లేత వర్ణాలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ కాలంలో సోఫా, కుర్చీలు, బెడ్, డైనింగ్ టేబుల్...వీటికి వేసే వస్త్రాల తొడుగులు లేత వర్ణాల్లో ఉంటే మంచిది. వీటిని పదేపదే మార్చడం నిజమే అయినప్పటికీ సీజన్ ను బట్టి ఒకసారి మార్చుకునేలా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. దీనివల్ల ఇంట్లోనూ కొత్త శోభ వెల్లివిరుస్తుంది. లేత వర్ణాలంటే తెలుపు, పసుపు, నీలం, పచ్చ, వంగపువ్వు రంగు, పింక్, నీలం, పిస్తా గ్రీన్, లెమన్ ఎల్లో ఇవి వేడిని కొంతవరకూ తిప్పికొడతాయి.

గదుల సీలింగ్ ని తెలుపు రంగులోనే ఉంచుకోవాలి. గోడలు లేత వర్ణాల్లో ఉండాలి. పరదాలకి ఉపయోగించే వస్త్రాలు నూలు తో చేసిన సహజ సిద్ద రకాలయితే వేడిని లోనికి రాకుండా అడ్డుకుంటాయి. ఎండ పెరిగిన తర్వాత ఏసీ వేయడం కాకుండా...అప్పుడప్పుడు వాటిని వినియోగిస్తుండాలి. నెలలు తరడబడి వాడకపోవడం వల్ల దుమ్మధూళి కారణంగా వాటి ఫిల్టర్లు పాడయి ఉంటియి. వాటిని శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా వాటి సమార్థ్యం పదిహేను శాతం పెరగుతుంది. దాంతో పది శాతం విద్యుత్ ఆదా అవుతుంది.

స్పిట్ ఏసీ, విండో ఏసీలకు బయట ఉండే అవుట్ డోర్ యూనిట్ కి తగినంత నీద కల్పించాలి. ఇలా చేయడం వల్ల వాటి సామర్థ్యం ఐదు శాతం పెరుగుతుంది. అదే జరిగితే గది త్వరగా చల్లబడుతుంది. రెండు గంటలు వాడే ఏసి సమయాన్ని గంటకు తగ్గించుకోవాచ్చు. తద్వారా విద్యుత్ ఆదా. రాత్రిపూట ఏసీ ప్రారంభించడానికి ముందు కిటికీలు తెరిచి ఉంచితే వేడి గాలి బయటకు పోతుంది. కూలర్లని ఉపయోగించేటప్పుడు వాటిల్లోని వెదురు కర్టెన్లని శుభ్రపరచడం, పాతవి తీసి కొత్తవి వేయడం వల్ల ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి వస్తుంది.

బాల్కనీలకు, ద్వారాలకు నిలువెత్తు వెదురు పరదాలని పొడవువుగా వేలాడదీసి, వాటిని గంటకొకసారి తడిపితే ఏసీ లేకపోయినా గదుల్లో కొంత వరకూ చల్లదనం అలముకుంటుంది. ఇప్పుడు వెదరు చాపలతో పాటు, బాంబూ కర్టెన్లు కూడా వస్తున్నాయి. అవి కూడా గదులని చల్లగా ఉంచుతాయి.

ఇంటి ఆవరణలో చెట్టు, లాన్ లు, మనీప్లాంట్ల, క్రోటన్ తరహా, పలుచని ఆకులుండే మొక్కలు ఉంటే ఇంట్లోకి తగినంత ఆక్సిజన్ అంది గదులు చల్లగా ఉంటాయి. వంటింటి కిటికీల వద్ద కొత్తిమీర, పుదీనా, మొక్కలు పెంచుకొంటే చల్లన, గృహిణులు వంటని వీలైనంత వరకు పదిగంటలకి ముందే కానిచ్చేస్తే వేడి సెగ తగ్గుతుంది.

English summary

Home decorating Tips to Keep The Sun Out....! | ప్రశాంతమైన..చల్లని ఇల్లు...!

If you need motivation to change your curtains to block sun light then try this. Imagine just how irritating the first rays of the blazing sun feel on your face specially on Sunday morning. The summer is is full throttle and if you are on the tropics then it is going to beat down on you even early in the morning. Your drapery ideas have to be adapted to the season so that your home is inhabitable even in summers. Here are some home decorating tips to help you chose curtains for sun protection in the summers.
Story first published:Tuesday, May 22, 2012, 13:19 [IST]
Desktop Bottom Promotion