Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి శోభను ఇనుమడించే ఫర్నీచర్....!

ఇంట్లో ఏర్పాటుచేసుకునే ఫర్నిచర్ తో పాటు గార్డెన్ ఫర్నిచర్ కూడా అందంగా ఉంటేనే చూడవచ్చు. గృహాలంకరణలో భాగంగా ఏర్పాటుచేసుకునే గ్లాస్ పెయింటింగ్స్, పలు రకాల డెకరేటివ్ ఐటమ్స్ ను ఇంట్లో అలంకరణ చేసుకొనే విధానాన్ని బట్టి ఉంటుంది. గృహిణికి ఎంతో వెసులుబాటుగా ఉండే మాడ్యులర్ కిచెన్స్, చిమ్నీలను ఇక్కడ అమర్చుకొంటే మరింత అందంగా..ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంటికి కొత్త అందాన్ని తేవాలంటే.. బోలెడు డబ్బు పెట్టి ఖరీదైన వస్తువులే కొనాల్సిన పని లేదు. ఉన్నవాటినే చిన్నచిన్న మార్పులు చేస్తే.. కొత్త కళ వస్తుంది. అదెలాగంటే గది మధ్యలో సోఫా, దానికి ఇరువైపులా కుర్చీలు, మధ్యలో టీపాయ్ చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ అదే తరహా అంటే మాత్రం... అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే.. సోఫాను మధ్యలో కాకుండా గోడపక్కన ఉంచితే గది విశాలంగా ఉంటుంది. అలాగే సోఫాల పక్కన చిన్న పూలకుండీని ఉంచితే.. ఆ ప్రత్యేకతే వేరు.
గదిలోని నాలుగు గోడలకూ రకరకాల కళాకృతులు... ఫోటోఫ్రేములు వేలాడదీయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఓ పనిచేయండి. బజార్లో వాల్ పోస్టర్లు దొరుకుతాయి. వాటిని తెచ్చి ఓ గోడకు అతికించండి. మిగిలినవాటికి నచ్చిన ఫోటోలు... సీనరీలను వేలాడదీయవచ్చు. అయితే.. వాటిపై దుమ్ము చేరుకొని పాత వాటిలా కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని ముందుగా దూదితో ఆ తరవాత తడివస్త్రంతో తుడిచేస్తే కొత్తవాటిలా ఉంటాయి.
అందరూ కూర్చునే గదిలో మూడు కిటికీలుంటే.. ఒకదాంట్లో చిన్నచిన్న పూలకుండీలను ఏర్పాటు చేయండి. గదిలో స్వచ్ఛమైన గాలి చేరుతుంది. చూడటానికి అందంగానూ ఉంటుంది. రంగు రంగుల పరదాలను గుమ్మాలకు, కిటికీలకు వేలాడదీస్తుంటాం. వాటితో పాటు పెయింట్ చేసిన పరదాను కుచ్చులు కుచ్చులు వచ్చేలా కుట్టి కిటికీలు, తలుపులకు వేలాడదీస్తే... గదికే అందమొస్తుంది.



Click it and Unblock the Notifications