Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటికి అందం..మనస్సుకు ఆహ్లాదం....!

బాల్కనీ, టెర్రస్‌ల గోడలకు ముదురు రంగులను వేయిస్తే చూసేందుకు ఆహ్లా దకరంగా ఉంటాయి. అలాగే లివింగ్ రూంలో లేత రంగులు ఎంపిక చేసుకుంటే ముదురు రంగు ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గది అందాన్ని పెంచవచ్చు. లేదా గోడకు వేసిన రంగులోనే ముదురు షేడ్‌లో ఫర్నిచర్ వేస్తే చాలా హుందాగా కనుపిస్తుంది. పడకగదికి లేత రంగులను వేయించాలి. ఇక ఎక్కువగా విశ్రాంతి తీసుకునే గదులకయితే ప్రశాంతతను పెంచే లేత నీలం, ఆకుపచ్చ, లావెండర్ రంగులు చాలా బాగా నప్పుతాయి.
అలాగే విశ్రాంతి తీసుకోవడానికి..ప్రైవసీకి..గ్లాస్ డివైడర్లతో పార్టిషన్‌ను ఏర్పరచుకునేందుకు పారదర్శకమైన అద్దాలను, రంగు రంగుల అద్దాలను, డిజైనింగ్ అద్దాలను ఉపయోగించవచ్చు. ఇక పడకగది పార్టిషన్ కోసం మాత్రం టెక్చర్డ్ అద్దాలు బాగా నప్పుతాయి. ఎందుకంటే ఈ అద్దాలు పారదర్శకంగా ఉండవు కాబట్టి ప్రైవసీకి ఢోకా ఉండదు. హాల్‌లో సీటింగ్ ఏర్పాట్లు, మ్యూజిక్ సిస్టం, టీవీ, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూసి అలా అమర్చుకోవాలి. గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. కాబట్టి, మీ గది రంగును రిప్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చితే మంచిది. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిపై ఫ్లవర్ బేసిన్‌ను పెట్టండి. రంగురంగుల డిజైన్‌లో వుండే బేసిన్‌లో నీళ్ళు పోసి, దానిపై రంగురంగుల అందమైన పూలను అమర్చండి.
చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేటప్పుడు అందంకంటే.. పిల్లల భద్రత, సౌకర్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పిల్లల గదినంతా సామానుతో నింపేయకుండా ఉండాలి. పిల్లలు కుదురుగా ఒకే చోట కూర్చోరు కాబట్టి, వారికి ఇష్టంవచ్చినట్లుగా తిరిగేందుకు గది విశాలంగా ఉండేలా చూడాలి. అలాగే పిల్లల పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి అల్మరాను పెట్టించటం మంచిది.



Click it and Unblock the Notifications