Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అసలుసిసలైన ఇంటికి అభిరుచితో పాటు అలంకరణ అవసరం...

వాటితో పాటు ఇంటికి ఆహ్లాదకరమైన రంగులు, పుష్కలమైన గాలీ వెలుతురు, అందాలొలికే ఫర్నీచర్ తో ఎక్కడి వస్తువులక్కడ అమర్చడంతో ఆ ఇంటి సౌందర్యం సొంత చేసుకుంటుంది. ముఖ్యగా పరిశుభ్రత. కాలికి దుమ్ము కణ తగలకుండా మూలలతో సహా ఎక్కడా బూజు పట్టకుండా, బల్లులు, సాలీడులు లాంటి జీవాలు దర్శనమివ్వకుండా వావ్ అపించేటట్లు సర్ధుకుంటే ఆ ఇంటికి వందకి వందశాతం మార్కులు వేయ్యెచ్చు.
వంటిల్లు... సర్వ సామాన్యంగా ఇల్లాళ్ళు ఎక్కువసేపు గడిపేది ఇక్కడే. ఉదయం కాఫీతో ప్రారంభమైతే రాత్రి పెరుగు తోడేసేందుకు పాలు కాచడం వరకూ అంతా అక్కడేగా! వంటిల్లు ఎంత పొందిగ్గా, శుభ్రంగా వుంటే మనకు అంత సుఖంగా, శాంతంగా వుంటుంది. ఉప్పు, పప్పు, పంచదార, టీపొడి డబ్బాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా, వరుసక్రమంలో సర్దుకోగల్గితే చూడ సొంపుగా వుండి అవసరమైనవి సులభంగా దొరుకుతాయి. ఏవీ పుచ్చిపోవు, పాడైపోవు. అల్మారాలను డెటాల్ కలిపిన నీళ్ళతో తరచు తుడిస్తిే బొద్దింకలు కాదుగదా, బాక్టీరియా క్రిములు కూడా మన ఇంటివైపు తొంగిచూడవు.
హాలు విశాలంగా వుంటే దానికి తగ్గ పెద్ద పెద్ద సోఫాసెట్లను ఎంచుకోవాలి. లేనిపక్షంలో స్థలం ఆక్రమించని, సుఖంగా ఆసీనం కాగలిగే సోఫాలను కొనుక్కోవడం ఉత్తమం. నడుం నొప్పి గట్రా రాకుండా సౌఖ్యంగా కూర్చోగల్గడం ఎంత ముఖ్యమో, వాటివల్ల ఇల్లు శోభించడం కూడా అంతే ముఖ్యం. టీపాయ్ ఏదో ఒకటి అని సరిపెట్టుకోకుండా సోఫా లేదా కేన్ కుర్చీలకు అనుకూలమైన దాన్ని ఎన్నుకున్నట్లయితే వన్నె పెరుగుతుందంటారు ఇంటీరియర్ డిజైనర్లు. టీపాయ్‌మీద పాత పేపర్లను పచడడం చాలామందికి అలవాటు. దీనివల్ల ఇంటి అందం తగ్గుతుందని గుర్తుంచుకుని, వాటిని లోపల వరుసగా భద్రపరిస్తే సరి. ఇల్లు కొత్త పెళ్ళికూతురిలానూ వుంటుంది, అవసరమైన పాత పేపర్ తేలిగ్గానూ దొరుకుతుంది.
ఇక పడకగదుల్లో వీలైతే రోజూ లేదంటే వారానికి రెండుసార్లయినా దుప్పట్లు మార్చి ఉతికించుకుంటే మనసు, శరీరం కూడా సేదతీరతాయి. బెడ్‌షీట్లు, కప్పుకునే దుప్పట్లకు ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లు వుండేలా ఎంచుకోవడం మన చేతిలో పనేకదా! ఇందులో మన అభిరుచి ప్రతిఫలిస్తుంది. ఖరీదెంత అనేదానికంటే కూడా ఎంత అందమైనవి అనేదానికే మెజారిటీ ఓటేస్తారు. మన అభిరుచి గొప్పగా వుండాలేకానీ తక్కువ ధరతో కూడా ఆకట్టుకునే వస్తువులు, దుస్తులను ఎంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications