Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఖరీదైనవి కాదు.. చక్కటి అభిరుచి ముఖ్యం....!

ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్నప్పటికీ, వాటి మధ్య సారూప్యం ఉంటే ఇంకా బాగుంటుంది. వంటగది, లివింగ్ రూం, డైనింగ్, పూజగది, డ్రాయింగ్ రూం వేటి అవే సాటి. ఇంటీరియర్ డెకరేషన్ లో ముఖ్యంగా డ్రాయింగ్ రూం అందాన్ని మరింత పెంచుతుంది. డ్రాయింగ్ రూమ్ అంత అందాన్ని ఎలా పొందుతుందంటే..డ్రాయింగ్ రూమ్ లో ఇత్తడి ఫర్నిచర్, ఉడెన్ ఫర్నిచర్ అమర్చాలి. కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ఫ్లవర్ వేజ్‌లతో ఎలా అమరిస్తే ఇల్లు అందంగా ఉంటుందో ఒక్కసారి మీ సృతి పథంలో ఊహించుకోండి.
హాల్లో సిటింగ్ ఏర్పాటు ఎలా ఉంటే చూడడానికి బావుంటుందో, సౌకర్యంగా ఉంటుందో చూడండి. మ్యూజిక్ సిస్టం, టీవీ, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టమ్, సోఫాల దగ్గర తివాచీలు ఎలా ఏర్పాటు చేస్తే అందంగా ఉంటుందో రకరకాలుగా అమర్చి చూసుకోసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అలా సరిచూసుకొన్నాకే ఫైనల్ గా అమర్చుకోవాలి.
మీ ఇంటికి వచ్చిన అతిథులు మీ గోడలకు ఉన్న పెయింటింగ్స్ చూసి వాటిని ఎక్కడ కొన్నారని అడిగి మాకు కూడా కొనిపెట్టండి అనేలా ఉండాలి. ఖరీదైనవి కాదు, చక్కటి అభిరుచి ముఖ్యం.
ఇంట్లో రూముల గురించి మాత్రమే కాక పోర్టికో, ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు ఊయల గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి.
మీ ఇంటి వరండాలోనూ, ఇంటిముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కోసం కేజ్‌లు ఏర్పాటు చేయండి. వాటిలో రంగురంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు వంటివి పెట్టండి. వాటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో తప్పు కాని విధంగా పెంచాలని మర్చిపోవద్దు. తాబేళ్లు, కుక్కలు, కుందేలు లాంటి జంతువులు కూడా ఇంటి అందాన్ని పెంచుతూ ఇంట్లో వాళ్లకు ఆత్మీయతను పంచుతాయి.
ఇంటిని ప్రశాంతనిలయంలా తీర్చిదిద్దడానికి ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్నంగా తెలిసి ఉండాలి. అప్పుడే అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన వస్తుంది.
ప్రతి గదిలోనూ ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్నపిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్, ఫ్లవర్ పాట్స్‌లాంటివి అమర్చుకోవాలి.
గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును రిఫ్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చుకోవాలి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిమీద ఫ్లవర్ బేసిన్ పెట్టి చూడండి ఆ అందం ఎలా ఉంటుందో. రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్ లో నీళ్లు పోసి దాని పై రంగురంగుల అందమైన పూలను అమర్చితే సహజ సిద్ధంగా ప్రకృతి తలపించినట్టు అవుతుంది.



Click it and Unblock the Notifications